Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వెనక్కు తగ్గిన కోమటిరెడ్డి …కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ కారణమా… ?

వెనక్కు తగ్గినా కోమటిరెడ్డికాంగ్రెస్ అధిష్టానం సీరియస్ కారణమా ….
ఇక నుంచి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయనని వెల్లడి
రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేసిన వైనం
తీవ్ర నిరాశకు గురైన కోమటిరెడ్డి..గాంధీ భవన్ మెట్లు వెక్కనని భీష్మ ప్రతిజ్న
తీవ్రస్థాయిలో మాణిక్యం ఠాకూర్ పై నిరసన గళం
తాజాగా మరోసారి స్పందించిన వైనం
తనను రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టీకరణ

సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు కాకుండా రేవంత్ రెడ్డి కి పీసీసీ పదవి ఇవ్వడంపై అగ్గిమీదగుగ్గిలం అయ్యారు . పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు . ఆయన డబ్బులు తీసికొని పదవి ఇచ్చారని ఓటుకు నోటులాగా వ్యవహారం నడిచిందని , చంద్రబాబు పాత్రకూడా ఉందని ,కాంగ్రెస్ ఆఫీస్ టీటీడీపీ కార్యాలయంగా మారనున్నది పార్టీ పరువు బజారుకీడ్చారు . ఉప్పు పులుసు లేకుండా కడిగి పారేశారు. పార్టీని అధికారంలోకి తెస్తానని అంటున్న రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉపఎన్నికల్లో డిపాజిట్ తెచుకోమను చూద్దామను అంటూ సవాల్ విసిరారు . దీనిపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించింది. వెంటనే రంగంలోకి దిగిన పెద్దలు పార్టీ నిర్ణయానికి ఎవరైనా భిన్నంగా మాట్లాడితే ఉపేక్షేశించేది లేదని వార్నింగ్ ఇచ్చారు….. దీనితో కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్వరంలో మార్పు వచ్చింది. ఇకనుంచి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయనని అనడం విశేషం ….

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత బాహాటంగా వినిపించిన తొలి నిరసన గళం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదే. పీసీసీ అధ్యక్ష పదవికి కోసం చివరివరకు ఆశించిన ఆయన… ఆ అవకాశం రేవంత్ రెడ్డికి దక్కడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక గాంధీభవన్ మెట్లెక్కను గాక ఎక్కను అంటూ శపథం చేసిన ఆయన తాజాగా మరోసారి తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. ఇకమీదట రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.

ప్రజాసమస్యలపై మాత్రం ఏ సమయంలో వచ్చినా స్పందిస్తానని, రాజకీయాల్లోకి మాత్రం తనను లాగొద్దని పేర్కొన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామానికి వెళతానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

Related posts

పేర్ని నాని-ఎంపీ బాలశౌరి వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్..

Drukpadam

జూబ్లీహిల్స్ కేసును పక్కదార్లు పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది: రేణుకా చౌదరి!

Drukpadam

రాహుల్ గాంధీ వర్చువల్ ర్యాలీకి ఆదరణ.. లైవ్ ద్వారా 11 లక్షల మంది వీక్షణ!

Drukpadam

Leave a Comment