Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ దళిత ద్రోహి: నిప్పులు చెరిగిన పొన్నాల లక్ష్మయ్య…

కేసీఆర్ దళిత ద్రోహి: నిప్పులు చెరిగిన పొన్నాల లక్ష్మయ్య
-తెలంగాణ తొలి సీఎం దళితుడే అని చెప్పారు
-దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని అన్నారు
-కేబినెట్ లో ఒక్క దళితుడికి కూడా స్థానం లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. దళితులకు సంబంధించి జరిగిన అఖిలపక్ష సమావేశానికి తనకు ఇష్టమైన వాళ్లనే పిలిచారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంత వరకు ఏమీ చేయలేదని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిన కేసీఆర్… తన కేబినెట్ లో దళితులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని అన్నారు. కేసీఆర్ వి ప్రకటనలే తప్ప… కార్యాచరణ ఉండదని విమర్శించారు.

దళితులకు ఏమి మేలు చేయవద్దని గత ఏడూ సంవత్సరాలుగా ఎవరు అడ్డు పడ్డారని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో ఎంతమంది దళితులూ ఉన్నారని అన్నారు . మాదిగ సామజిక వర్గానికి ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది నిజంకాదా ? అని కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు . మాయమాటలు ,మోసం ,దగా , అబద్దాలు కేసీఆర్ నైజమని అన్నారు . దళితులకు సమావేశం అని తనకు ఇష్టమైన వల్లనే పిలవడం ఎలాంటి దళిత ప్రమో చెప్పాలని డిమాండ్ చేశారు .

కేవలం హుజారాబాద్ ఉప ఎన్నక వస్తుందని తెలిసి మాత్రమే దళితులకు ఆయనేదో మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడ్డట్లు వ్యవహరించడం అభ్యంతరకరమని అన్నారు. ప్రజలను ఎవరైనా కొంతకాలమే మోసం చేయగలరనేది కేసీఆర్ గుర్తుంచుకోవాలని పొన్నాల హెచ్చరించారు.

డబుల్ బెడ్ రూమ్ లు అన్నారు . దళిత సీఎం అన్నారు.మూడెకరాల భూమి అన్నారు .. ఇంటింటికి ఉద్యోగం అన్నారు . నీళ్లు నిధులు , నియామకాలకు తెచ్చుకున్న తెలంగాణ చివరకు కేసీఆర్ కుటుంబం కోసమే అని ప్రజలు భావిస్తున్నారని దుయ్యబట్టారు . తొందరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పొన్నాల తదైనా శైలిలో కేసీఆర్ పాలనపై విరుచుక పడ్డారు…..

Related posts

రాష్ట్రపతి పాలన విధించాలని కోరడానికి కారణం ఇదే: చంద్రబాబు!

Drukpadam

100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. ఖమ్మం బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

Drukpadam

తెలంగాణ సర్కార్ పై విజయశాంతి ఫైర్…

Drukpadam

Leave a Comment