Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జలవివాదంపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు…

జలవివాదంపై ఏపీ సీఎం జగన్ ీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని స్పష్టికరణ
రైతులకు అన్యాయం జరిగితే ఎందాకైనా వెళతాం
వివాదాలకు తాము వ్యతిరేకం, ఆలా అని ఉరుకోము
తెలంగాణలో ఏపీ వాళ్లు ఉన్నారని ఆలోచిస్తున్నా
అందుకే ఎక్కువగా మాట్లాడడంలేదు
తాను మాట్లాడితే ఏపీ ప్రజలను ఇబ్బందిపెడతారని వెల్లడి
రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
ప్రధానికి లేఖ రాయాలని భావిస్తున్నట్లు వెల్లడి

ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో నీటి వివాదాల నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ఏపీ వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, తానేదైనా గట్టిగా మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని, అందుకే తాను ఎక్కువగా మాట్లాడడం లేదని వివరణ ఇచ్చారు.

అదే సందర్భంలో రైతులకు అన్యాయం జరిగితే ఎందాకైనా వెళ్తామని స్పష్టం చేశారు. బేసిక్ గా పక్కరాష్ట్రాలతో వివాదాలు వద్దనే ఉద్దేశంతోనే ఉన్నామని ఆలా అని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటుంటే , రైతులకు అన్యాయం జరుగుతునటుంటే నోరుమూసుకుని కూర్చునే వాళ్ళం మాత్రం కాదని అన్నారు .

తెలంగాణ మంత్రులు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఇది పద్దతికాదని హితవు పలికారు . కృష్ణ జలాల వినియోగంపై తమకు కేటాయించిన వాటా వాడుకునేందుకు ఆంక్షలు ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి కేటాయింపులు జరిగాయి. కేటాయింపులకన్నా చుక్క నీరు ఎక్కువగా వాడుకోమని చెప్పటం జరిగింది. పదే పదే చెబుతున్నాం అయిన దానిపై రాద్ధాంతం చేయడం తగదని అన్నారు .ఇందుకోసం ప్రధానికి లేఖరాయాలని భావిస్తున్నట్లు తెలిపారు .

తెలంగాణ విద్యుదుత్పత్తి అంశంపై మరో లేఖ రాయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అనుమతి లేని జలాల వాడకంపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని స్పష్టం చేశారు. జలవివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

“తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నా. అందుకే నేను సంయమనం పాటిస్తున్నా. కానీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు” అంటూ సీఎం జగన్ తీవ్రస్వరంతో స్పందించారు. జల వివాదాల అంశంలో ఏంచేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు.

 

Related posts

టీడీపీ ఆలా వైకాపా ఇలా …..లేటరైట్ బాక్సెట్ తవ్వకాలు పై పరస్పర విమర్శలు!

Drukpadam

ఓర్వలేకపోతున్నారు… అసూయతో కుళ్లిపోతున్నారు: వైసీపీ నేతలపై పవన్ ట్వీట్ల వర్షం!

Drukpadam

ప్రధాని మోడీ పై ఆసక్తి రేపుతున్న శరద్ పవార్ ప్రసంశలు…

Drukpadam

Leave a Comment