Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం లో చర్చ్ కంపౌండ్ బ్రిడ్జి పై మొండం నుంచి వేరైనా తల కలకలం…

ఖమ్మం లో చర్చ్ కంపౌండ్ బ్రిడ్జి పై మొండం నుంచి వేరైనా తల కలకలం
-రైలు కింద పడి యువకుడు మృతి చెందాడని నిర్దారణ
-రైల్వే ట్రాక్ పక్కన మొండం గుర్తించిన పోలీసులు
-బ్రిడ్జి పైకి కుక్కలు తెచ్చియని అనుమానం

ఖమ్మం లోని చర్చి కాంపౌండ్ బ్రిడ్జి పై మొండం నుంచి వేరైనా తల కనిపించడం కలకలం సృష్టించింది . ఈ విషయం ఖమ్మం నగరంలో వ్యాపించడంతో ఎవరు… హత్య చేసి ఇలా బ్రిడ్జిపై పెట్టారా ?అసలు ఎక్కడ జరిగిఉంటున్నానే అనుమానాలు కలిగాయి. దాన్ని చూసేందుకు అనేక మంది వచ్చారు. మొండం లేని తలను తమ కెమెరాలలో బంధించారు…..

ఎవరిది ఈ తల,ఏంటి ఈ గోరం అని చాలా మంది భయం,భయం గానే తమ సన్నిహితులు వద్ద చర్చ.ఖమ్మం నగరం లోని చర్చికంఫౌండ్ వద్ద గురువారం ఉదయం దర్శనం ఇచ్చిన మనిషి తల కలం, కలం సృష్టించింది. విషయం తెలుసుకుని సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు సమీపంలో ని రైలు ట్రాక్ నుండి చనిపోయిన మృతదేహాము తల కుక్కలు తీసుకు వచ్చాయి అని నిర్ధారించారు..రైలు ప్రమాదం లో వ్యక్తి చనిపోయాడని.రైల్వే పోలీసులు కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తల కాయని పట్టుకెళ్లారు.. నిజం తెలుసుకొని జనం ఊపిరి పీల్చుకున్నారు

ఈ తల మొండం గుగులోతు రాజుది అని నిర్దారణ ….

 

కొంత సేపు కలకలం సృష్టించిన మొండం లేని తల ను గుర్తించారు… ఖమ్మం నర్తకి ధియేటర్ సమీపంలో గుగులోతు రాజు(28) బుధవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల మొండం ఖచ్చితంగా తెగిపోయేలా రైలు కింద పడుకున్నారు. దీంతో అవి రెండు వేరుఅయ్యాయి. లోకో పైలెట్ సమాచారం మేరకు జీ ఆర్ పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. తల, మొండెం వేరు కాగా.. తలను కుక్కలు చర్చి కాంపౌండ్ వంతెన వద్ద తీసుకెళ్లి పడవేశాయి.. రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు , అనేది ఇంకా తెలియరాలేదు …. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీ ఆర్ పీ ఎస్సై రవి కుమార్ తెలిపారు .

Related posts

ముంబై అమిత్ షా సభలో ఎండదెబ్బకు 11 మృతి 50 అస్వస్థత …!

Drukpadam

అమెరికాలో విషాదం.. భారత సంతతి సంపన్న కుటుంబం ఆత్మహత్య?

Ram Narayana

పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్…

Ram Narayana

Leave a Comment