Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జల జగడంపై : ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ…

జలంపై జగడం : ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
జల వివాదంలో జోక్యం చేసుకోవాలని  విజ్ఞప్తి 
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం
తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోందని జగన్ లేఖ
ప్రాజక్టు వద్ద సి ఎస్ ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలి
రెండు రాష్ట్రాలకు నీటి పంపకం కృష్ణానది బోర్డు కు అప్పగించాలని సూచన

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా ఉంటారనుకుంటే కత్తులు దుస్తున్నారు…. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారువ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు…. రాష్ట్రాలమధ్య దమ్ము దైర్యం గురించి సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు…. క్రిష్ణానది నీటి వినియోగంపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడంతోపాటు ,రాయలసీమ ఎట్టి పోతలపథకాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా కడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. తాముప్రాజెక్టు ఎక్కడకట్టినప్పటికితమకు కేటాయించిన నీటిని తప్ప అదనంగా చుక్కనీటిని కూడా ఎక్కువ డ్రాచేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. ఎగువన ప్రాజెక్టు కడితే కిందకు నీళ్లు రావని తెలంగాణ అంటుండగా , కేవలం 20 రోజులు వరదల సమయంలోనే నీటిని వాడుకునే అవకాశం ఉందని ఆంధ్ర సర్కార్ అంటుంది. ఇరు రాష్టాల మధ్య నెలకొన్న నీటి పంపకాల ప్రతిష్టంభన తొలగించేందుకు కేంద్రం సైతం ప్రయత్నించిన దాఖలాలు లేవుఎవరు చెప్పిన వినడం తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలేదు . దీంతో రెండు రాష్ట్రాల జల జగడం ప్రజలను ఆందోళనలోకి నెడుతుంది .ప్రాజక్టుల వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి. తెలంగాణ ఇప్పటికే కేంద్రానికి, జలశక్తి మంత్రికి ,లేఖలు రాయగా , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధాని మోడీ కి లేఖ రాశారు.

ప్రధాని మోదీతోపాటు , కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఐదు పేజీల లేఖను పంపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని లేఖలో జగన్ ఆరోపించారు.

కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా జలాలను ఉపయోగిస్తోందనిదాన్ని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రధానిని జగన్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంలో కలగజేసుకోవాలని ప్రధానికి విన్నవించారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ తో రక్షణ కల్పించాలని కోరారు. లేఖతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కోకు రాసిన లేఖ, విద్యుదుత్పత్తికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని జత చేశారు.

Related posts

ప్రధాని పేరు చెపితే చలి జ్వరమా బీజేపీ …చీఫ్ పాలిటిక్స్ చేయవద్దు …టీఆర్ యస్!

Drukpadam

బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌!

Drukpadam

వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా: పవన్ కల్యాణ్

Drukpadam

Leave a Comment