కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి : రేవంత్ రెడ్డి
పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
వారు డబ్బుకు అమ్మడు పోయారని ఆరోపణ
వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్
లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి నాయకులను రాళ్లతో కొట్టాలని అన్నారు. తమ పార్టీని వదిలి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యేంత వరకు పోరాడతామని చెప్పారు.
ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఎన్నికలకు రావాలని అన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుబోయారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు .
హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను ఈరోజు రేవంత్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి
కాంగ్రెస్ పార్టీ టిక్కర్ పై గెలిచి అధికార టీఆర్ యస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల లు తిరిగి స్వంతగూటికి చేరుకుంటారా? రేవంత్ మంత్రాంగం పనిచేస్తుందా ? ఇప్పటికే ఒకరిద్దరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. అట్టివారిలో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంతకు ముందు ఒకసారి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరారు. తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అందువల్ల ఆయన కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ పై ఒంటికాలుతో లేచిన దానం అనుహ్యంగా టీఆర్ యస్ చేరారు. ఆయన అక్కడ మంత్రి పదవిని ఆశించారు. కానీ అది దక్కలేదు దీంతో ఆయన అక్కడ ఉండలేక పోతున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ నుండి తెరాసలో చేరిన ఒక సబిత ఇంద్రారెడ్డి తప్ప మిగతా వారికి సరైన న్యాయం దక్కలేదు . పార్టీలో సీనియర్లను కలుస్తూ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. మరికొందరిని అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది. కాంగ్రెస్ నుండి ఇతర పార్టీలకు వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి వస్తారా ? లేక వారిపై అనర్హత వేటు వేయించగలరా ? అనేది చూడాల్సి ఉంది.