Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధం…

భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధం
-కరోనా కేసుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం
-జులై 21 వరకు 14 దేశాలకు ప్రయాణాలపై నిషేధం
-కార్గో, చార్టర్డ్ విమానాలకు మాత్రం అనుమతి

భారత్ తో సహా మరో 14 దేశాలకు జులై 21 వరకు ప్రయాణాలని నిషేదిస్తున్నట్లు యునైట్ అరబ్ ఎమిరైట్స్ ప్రకటించింది. దీంతో ఆ దేశాలకు సంబందించిన ప్రయాణికులు మరికొన్ని రోజులు పాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది . అరబ్ దేశాల వ్యాపారులకు భారత్ తో వ్యాపార లావాదేవీలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల ప్రయాణాలపై నిషేధంతో కొన్ని ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఈ నిషేధం జులై 21 కొనసాగుతుందని యూఏఈ ప్రకటించింది. ఇప్పటికే తమ ప్రయాణాలు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆదేశం మీదగా వెళ్లే వారికీ ఇది వర్తింస్తుందో లేదో స్పష్టంగా చెప్పలేదు.

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో పాటు పలు వేరియంట్లు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన భారత్ లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదే సమస్యను ప్రపంచంలోని పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి భారత్ లో జనాభా అధికంగా ఉండటంతో పాటు కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ చాల వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ జాబితాలో భారత్ తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. జులై 21 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని, ఆయా దేశాలకు తమ ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకూడదని యూఏఈ తెలిపింది. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అయితే ఛార్టర్డ్, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది.

Related posts

తిరుపతి ఆసుపత్రిలో చనిపోయింది 11 మంది కాదు.. 23 మంది సిపిఐ నారాయణ

Drukpadam

గుజరాత్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో మంటలు.. 12 మంది రోగుల సజీవ దహనం

Drukpadam

ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Drukpadam

Leave a Comment