Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు !

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు !
-7, 8 తేదీల్లో విస్తరణకు అవకాశం
-యూపీ నుంచి ఎక్కువమందికి ప్రాతినిధ్యం?
-మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి విస్తరణ
-పశుపతి పరాస్‌కు కేబినెట్‌లో స్థానం!

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. రేపు, లేదంటే ఎల్లుండి కేబినెట్‌ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గంలో ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అలాగే, పశ్చిమ బెంగాల్‌కూ ప్రాతినిధ్యం పెరుగుతుందని సమాచారం. ఎప్పటినుంచో చాలామంది నేతలు మంత్రివర్గంలో బెర్తుల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ను చీల్చి మధ్యప్రదేశ్ లో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర కాబినెట్ లో బెర్తు ఖాయంగా కనిపిస్తున్నది. ఆయన బీజేపీ లో చేరేటప్పుడే కేంద్ర మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు .

ప్రతుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి . మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగిస్తారని దానిపై ఉత్కంఠ నెలకొన్నది . అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. బీజేపీ మిత్ర పక్షాలైన జేడీయూ, అప్నాదళ్ పార్టీల నుంచి కూడా ఒకరిద్దరికి బెర్తులు లభించే అవకాశం ఉంది. లోక్‌జనశక్తి చీలికవర్గం నేత పశుపతి పరాస్ కు కూడా మంత్రివర్గంలో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. 2019లో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి విస్తరణ కావడం గమనార్హం. గరిష్ఠంగా 20 మందికి బెర్తులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, నేడు హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానుండడం కూడా కేబినెట్ విస్తరణ వార్తలను బలపరుస్తోంది. ముహూర్తం ప్రకారం రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి .

Related posts

ముంబై లో కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ కలయిక యాదృచ్చికమా ? కెసిఆర్ ప్రమేయమా??

Drukpadam

కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వెళ్ళాను :టీడీపీ నేత పట్టాభి !

Drukpadam

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మౌర్య కాన్వాయ్‌పై దాడి!

Drukpadam

Leave a Comment