Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయరంగంలోకి కార్పోరేట్లు -బీజేపీ మతోన్మాధంపై బహుముఖ పోరాటం…చాడ వెంకటరెడ్డి

వ్యవసాయరంగంలోకి కార్పోరేట్లు

బీజేపీ మతోన్మాధంపై బహుముఖ పోరాటం

ధరల అదుపులో పాలకుల వైఫల్యం : రాష్ట్రసమితి సమావేశంలో చాడవెంకటరెడ్డి


ఖమ్మం : వ్యవసాయ రంగంలోకి కార్పోరేట్లను ఆహ్వానించడం ద్వారా రైతులను భూమికి దూరం చేసే కుట్రకు బీజేపీ తెరలేపిందని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు . చిన్నచిన్న కమతాల స్థానే పెద్ద పెద్ద కమతాలు రానున్నాయని రైతులు ఇక వ్యవసాయ కూలీలుగా మారే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు . స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం సి.పి.ఐ రాష్ట్ర సమితి సభ్యుల సమావేశం జరిగింది . సి.పి.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడా మాట్లాడుతూ దేశంలో అన్నిప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పోరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళిక రూపొందించిందని నూటికి 70 శాతం మంది అధారపడిన వ్యవసాయ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని చాడా తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువులు , పెట్రోలు , గ్యాస్ ధరలకు అడ్డు అదుపులేకుండా పోతుందని ధరలను అదుపు చేయడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు . కేంద్రంలోని మోడీ రాష్ట్రంలోని కేసీఆర్ ఇద్దరు ప్రజలను మరిచి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు . కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి జనం అవస్తలు పడుతుంటే అదిపట్టించుకోకుండా ధరలను పెంచడం ఏమిటని చాడా ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ మతోన్మాధ విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం నిర్వహిస్తామన్నారు. బీజేపీ తీరుతో దేశంలో ప్రజల మధ్య చీలిక వచ్చి ఐక్యత దెబ్బతింటుందని చాడా తెలిపారు . కేసీఆర్ వైకరితో రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుందని చైతన్యంతమైన తెలంగాణాలో ఇది సాధ్యకాదన్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో పోడుభూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని అనేక దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఒక్క ఖమ్మం జిల్లాలోనే లక్ష ఎకరాల భూమిని లాక్కున్నారని రాష్ట్ర వ్యాపితంగా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు . కాంగ్రెస్ దేశవ్యాపితంగా సంస్థాగతంగా బలహీన పడుతుండటం, మిగిలిన పక్షాలు అంత బలంగా లేకపోవడం దేశ రాజకీయలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు . ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీని ఆత్మరక్షణ వైపు నెట్టివేశాయని చాడ తెలిపారు . తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పులు వస్తున్నాయని కొత్తపార్టీల ఏర్పాటు, పార్టీ నేతల మార్పుతోపాటు పాదయాత్రల సీజన్ ప్రారంభమవుతుందన్నారు . రేవంతరెడ్డి ప్రమాణస్వీకారం బండి సంజయ్ పాదయాత్ర రాజకీయాలలో వేడెక్కిస్తున్నాయని చాడా తెలిపారు . పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు నాటి ప్రజా ఉద్యమాల స్పూర్తితో మున్ముందు పోరాటాలను , ప్రజా ఉద్యమాలను నిర్మించాలని చాడాకోరారు . ఈ సమావేశంలో సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రసంగించగా, సి.పి.ఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బాగం హేమంతరావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.కె.సాబీర్వాషా, బి. అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

మా లో లోకల్ …. నాన్ లోకల్ గొడవ రామ్‌గోపాల్ వ‌ర్మ‌ స్పందన….

Drukpadam

పాములు పట్టడం ప్రాణాలకు తెగించడమే…

Drukpadam

హరిత తెలంగాణ కోసమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్….ఎంపీ సంతోష్…

Drukpadam

Leave a Comment