Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్!

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్
-కాంగ్రెస్ కోసం నిబద్ధతగా నిలిచినా వాళ్లకు నా సెల్యూట్
-ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను
-తెలంగాణ ఏర్పడిందే నీటివాటా కోసం
-కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కన్నా, ఇప్పుడు ఎక్కువ అన్యాయం
-దీనికి కేసీఆర్ భాద్యత వహించాలి
-పోతిరెడ్డిపాడు 40 వేల నుంచి 88 వేల క్యూసెక్కుల నీరు అధికారికంగా పోతున్నాయి
– సంగమేశ్వర్ లిఫ్ట్ రోజు మూడు టీఎంసీ డ్రా చేసేందుకు సిద్ధపడుతుంది
-లక్ష 18 వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా వచ్చేనీళ్ళు కేవలం 3 టీఎంసీ లే

తెలంగాణ రాష్ట్రంలో అనేక నిర్బంధాలకు , బెదిరింపులకు ఎదురొడ్డి నిలిచి పార్టీకోసం పని చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నానని పీసీసీ మాజీ అధ్యక్షుడు , నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్రంలో అనేక సవాళ్లు ఎదురైనా , తట్టుకొని కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న కార్యకర్తలను అభినందించాల్సిందేనని అన్నారు. తనకు పీసీసీ అధ్యక్షుడిగా చేసే గొప్ప అవకాశం దొరికిందని తనకు సహకరించిన ప్రతినాయకుడికి ,ఎమ్మెల్యేగా మంత్రిగా , పీసీసీ అధ్యక్షుడుగా అవకాశం కల్పించిన సోనియా గాంధీకి , రాహుల్ గాంధీ కి కృతజ్నతలు తెలుపుతున్నానని అన్నారు. తన పదవి కాలంలో సహకరించిన తోటి మిత్రులకు , నాయకులకు , ఎమ్మెల్యే లకు ఎంపీ లకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కు మంచి భవిష్యత్ ఉందని అన్నారు.

నీళ్లు ,నిధులు నియమాకాలకోసం ఏర్పడిన తెలంగాణాలో తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రా కు 11 టీఎంసీ నీళ్లు పోతుంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అర్థం కావడం లేదా ? అని ప్రశ్నించారు. నీటి విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీరు రాకుండా పోయింది. నాగార్జున సాగర్ ఎడారిగా మారబోతుంది హెచ్చరించారు. కాళేశ్వరం 3 టీఎంసీ ల కోసం లక్ష 18 కోట్లు ఖర్చు పెడుతున్నాము . ఇందులో ఎంత దోపిడీ ఉందొ అర్థం చేసుకోవచ్చు . ఏడున్నర సంత్సరరాలలో దేశంలోనే అత్యధిక అప్పుల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 15 వ ఆర్థికసంఘానికి అప్పుల విషయం తెలియజేశాను . వారు దీనిపై తప్పకుండ చర్యలు తీసుకుంటారని అన్నారు.
8 శాతం కమిషన్ కోసం కక్కుర్తి పడి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందిన కాడికి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే నిరుద్యోగం అధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ , నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. ఎక్కడ మన నియామకాలు అని యువత అడుగుతుంది అన్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇరిగేషన్ లాస్ , అవినీతికి అంతులేదు , అప్పులు విషయంలో లిఖిత పూర్వకంగా పార్లమెంట్ కు నోటీసు ఇచ్చాను . వాటిపై కచ్చితంగా మాట్లాడతానని తెలిపారు.

Related posts

ఘనంగా ప్రారంభమైన సిపిఎం ఖమ్మం జిల్లా 21 వ మహాసభలు…

Drukpadam

బీఆర్ యస్ తో పొత్తు కుదరకపోతే 119 సీట్లలో పోటీ…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని…

Drukpadam

విద్యార్థులు పోరాటాల్లో ముందు ఉండాలి…మనోహర్ రాజు

Drukpadam

Leave a Comment