Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ నీటికోసం ఎందాకైనా … మేము గాజులు తొడుక్కులేదు …మంత్రి పువ్వాడ…

తెలంగాణ నీటికోసం ఎందాకైనా పోరాటం … మేము గాజులు తొడుక్కులేదు …మంత్రి పువ్వాడ
-దొంగను దొంగే అంటాం… వైయస్ జగన్ కు భయపడే ప్రసక్తే లేదు
-నాడు తండ్రి ,నేడు కొడుకు నీటిని దోచుకున్న దొంగలు
-మానీటిని దోచుకుంటుంటే చూస్తూ ఉర్కొం
-నోరు మూసుకుంటే తెలంగాణ ఎడారి అవుతుంది
-కేసీఆర్ ఉండగా అదిజరగనివ్వరు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం రోజురోజుకూ ముదురుతోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నా పల్లె ప్రగతి కార్యక్రమాలలో బిజీ బిజీ గా పాల్గొంటున్న ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలోని అడవిమల్లెల లో జరిగిన సభలో వైయస్ జగన్ , ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డిపై ఘాటైన విమర్శలతో సభ హిట్ పెంచారు మంత్రి అజయ్ , ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎంపీ నామ నాగేశ్వర్ రావు , ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్యేకి బాలసాని లక్ష్మి నారాయణ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

‘రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాడు.. నేడు ఆయన కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు. కృష్ణా జలాలు దోచుకుంటున్న దొంగని దొంగ అనే అంటాము. జగన్‌కు భయపడే ప్రసక్తే లేదు.మేమేం గాజులు తొడుక్కుని కూర్చోలేదు.తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కోసం ఎంతదూరమైనా వెళ్లతాం.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం.ఇప్పటికే కేంద్రానికి మా అభ్యంతరం తెలియజేశాం. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోము. మీ ఇష్టం వచ్చినట్టు శ్రీశైలం దగ్గర బొక్క కొట్టి కృష్ణా జలాలు దోచుకుంటుంటే ఊరుకునే ప్రశక్తేలేదు. వాళ్ళు మాత్రం నెల్లూరు ,చిత్తూరు వరకు నీళ్లు తీసుకోని పోవాలట ,మనం మాత్రం మన హక్కులను ఉపయోగించుకోవద్దట ఇదెక్కడి న్యాయం అని అన్నారు.

మా హక్కుల కోసం మా వాటా కోసం అవసరమైతే దేవునితో అయినా కొట్లాడతామని కేటీఆర్ చెప్పిన విషయం మర్చిపోవద్దు’ అని పువ్వాడ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో అడవి మల్లేలలో ‘పల్లె ప్రగతి’ సభలో జలజగడంపై మాట్లాడుతూ పువ్వాడ ఇలా వ్యాఖ్యలు చేశారు.
పువ్వాడ ఉన్నట్లు ఉండి నీటి విషయాలు ప్రస్తావిస్తూ ఏపీ లో అక్రమంగా కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించడం , అదే విధంగా పోతిరెడ్డిపాడు విస్తరించడంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హితబోధనలు చేసిన నేపథ్యంలో మంత్రి అజయ్ ఘాటు విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

Related posts

జనసేన బాటలో టీడీపీ …బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవమేనా …?

Drukpadam

వైసీపీలో సుబ్బారావు గుప్త తలనొప్పి …మరో రఘరామ అంటున్న కార్యకర్తలు

Drukpadam

యువతితో హోటల్ రూమ్ లో కేంద్ర మాజీ మంత్రి… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. 

Drukpadam

Leave a Comment