Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శంషాబాద్‌లో రూ. 21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. జాంబియా మహిళ అరెస్ట్…

శంషాబాద్‌లో రూ. 21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. జాంబియా మహిళ అరెస్ట్
ఖతర్ ఎయిర్‌లైన్స్‌లో శంషాబాద్ చేరుకున్న మహిళ
ఆమె బ్యాగేజీలో 3.2 కేజీల హెరాయిన్
తెరవెనుక సూత్రధారులపై పోలీసుల ఆరా

శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఖతర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జాంబియా నుంచి వచ్చిన మహిళ నుంచి 21 కోట్ల రూపాయల విలువైన 3.2 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు జాంబియా నుంచి జొహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా శంషాబాద్ చేరుకుంది. ఆమె రహస్యంగా మాదకద్రవ్యాలను తీసుకొస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు ఆమె బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో పొడి రూపంలో ఉన్న హెరాయిన్ లభ్యమైంది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని తెరవెనుక ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

13 కిలోల బరువు తగ్గిన మస్క్.. సీక్రెట్ ఇదేనంటూ ట్వీట్!

Drukpadam

అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానయాన సంస్థల షాక్.. చార్జీలు అమాంతం పెంపు

Drukpadam

సమయపాలన పాటించాలన్న ప్రధానోపాధ్యాయురాలు.. భర్తతో కొట్టించిన టీచర్!

Drukpadam

Leave a Comment