Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల పీఆర్ సి- ముఖ్యమంత్రి పైనే ఆశలు

ఉద్యోగుల పీఆర్ సి- ముఖ్యమంత్రి పైనే ఆశలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సంఘం సిపార్సులు సరిగా లేవని మండి పడుతున్న ఉద్యోగ సంఘాలు ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ కేవలం 7 .5 శాతం మాత్రమే ఉండటంతో గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు తాము ఎట్టి పరిస్థిలలోను పీఆర్సీ ని ఆమోదించేది లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ కు తేల్చి చెప్పారు. అన్ని జిల్లాలలోకూడా పీఆర్సీ పై ఉద్యోగులు భవిషత్ కార్యాచరణపై ఆలోచనలు చేస్తున్నారు.రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పీఆర్సీ ఎప్పుడు చూడలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడైనా పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత చర్చలు జరపటం చివరకు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళటం ఉద్యోగ సంఘాలతో ఫైనల్ గా చర్చించిన అనంతరం ఉద్యోగులను సంతోష పెట్టెవిదంగా పీఆర్సీ ని ముఖ్యమంత్రి నిర్ణయించటం , ముఖ్యమంత్రిని పొగడటం , జిందాబాద్ లు కొట్టడం సాధారణంగా జరుగుతుంది . తెలంగాణ రాష్ట్రంలో గతంలో కన్నా మిన్నగా మన రాష్ట్రము మన ఉద్యోగులు , మనం కడుపు నిండా పెట్టుకుందాం అని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరించటంపై నిరాశ చెందిన ఉద్యోగులు మదన పడుతున్నారు. అసలు పీఆర్సీ లేకపోయినా ఫర్వాలేదు కానీ అవమానకరంగా పీఆర్సీ నివేదిక ఉండటంతో జీర్ణించుకోలేక పోతున్నారు. ఇందుకోసమేనా రాష్ట్రము కోసం పోరాడిందని ప్రశ్నిస్తున్నారు. తమకు గౌరవ ప్రదమైన పీఆర్సీ ఇస్తే సరే సరి లేకపోతె ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి ఉద్యోగుల మూడ్ ను అర్థం చేసుకొని సరైన న్యాయం చేయాలనీ కోరుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు చేరినందున ఆయన ఏమి చేస్తారనే దానికోసం ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ కమిటీ రిపోర్ట్ కు ఉద్యోగులు ఆశించే దానికి మధ్య భారీ తేడా ఉండటంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనే ఉత్కంఠ నెలకొన్నది . రేపో మాపో ఇది జరిగే ఆవకాశం ఉంది. ఏమి జరుగుతుందో చూద్దాం .

Related posts

తాలిబన్ల వేగం ఆశ్చర్యానికి గురి చేసింది: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్!

Drukpadam

మమ్మల్ని భారత్‌కు పంపించేయరూ.. బహ్రెయిన్‌లోని తెలుగు కార్మికుల గోడు!

Drukpadam

అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితి పెంపు!

Drukpadam

Leave a Comment