జగన్ మాజీ సీఎం కాబోన్నారా ?.. ఆయన బెయిల్ రద్ద అవుతుందా ?? మాజీ కేంద్రమంత్రి చింత –మోహన్ వ్యాఖ్యల వెనక మర్మం ఏమిటి ???
–ఏపీలో పెను రాజకీయ మార్పు జరగబోతుందా?
–చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎం కాబోతున్నారా ? ఆయన బెయిల్ రద్దు అవుతుందా ?? కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ నాయకుడు చింత మోహన్ మాటల వెనక మర్మం ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ సూటిగా చెప్పకుండానే ఆయన మాజీ కాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అంటే ఆయన దృష్టిలో బెయిల్ రద్దు అవుతుందనే అభిప్రాయంతో ఉన్నట్లు ఉన్నారు. బెయిల్ రద్దు కావాలనేది ఆయన కోరిక కావచ్చు …. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్ 18 నెలలు జైల్లో ఉన్నారు. అన్ని రోజులు బెయిల్ రాకుండా జైల్లో ఉండటమే ఒక రికార్డ్ .మళ్ళీ బెయిల్ రద్దు అయితే ఇదో రికార్డ్ కానున్నది .ఈ నెల 25 న సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నదనే ఉత్కంఠ నెలకొన్నది .
రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పు రాబోతోందన్నారు మాజీ కేంద్రమంత్రి. జగన్ ఉత్తరాధి పారిశ్రామిక వేత్త, కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని కోరుతున్నారని చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పు రాబోతోందన్నారు. మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ కాబోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు.
జగన్ బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాధి పారిశ్రామిక వేత్త, కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని కోరుతున్నారని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని ఉమ అరెన్ట్‌ను ఖండిస్తున్నట్లు చింతామోహన్ చెప్పారు. ఎంపీ రఘురామక్ళష్ణరాజును కొట్టడం తప్పన్నారు. చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన గతంలో కూడా వైఎస్ జగన్ టార్గెట్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం వాయిదా పడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఆగష్టు 25కు వాయిదా వేసింది. కోర్టు తుది తీర్పును 25న వెల్లడించే అవకాశం ఉంది. ఈ వ్యవహారాన్ని చింతా మోహన్ ప్రస్తావించారు.