Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

విజ‌య‌సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయడం చేయకపోవడం మీ ఇష్టం కోర్టు కు తెలిపిన సిబిఐ!

విజ‌య‌సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయడం చేయకపోవడం మీ ఇష్టం కోర్టు కు తెలిపిన సిబిఐ!
-పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వ‌దిలిపెడుతూ సీబీఐ మెమో దాఖ‌లు
-విచక్షణాధికారాల‌ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న సీబీఐ
-కౌంటర్‌ దాఖలకు గడువు కావాలన్న‌ విజయసాయి
-తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా

అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టు లో గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్ వేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృషంరాజు జగన కేసు తురుపు వెలువడక ముందే విజయసాయిరెడ్డి పై పిటిషన్ వేశారు. ఆయన బైలు కూడా రద్దు చేయాలనీ సిబిఐ కోర్టును రఘురామ కొరారు. దానికి సిబిఐ వర్షన్ కోర్ట్ అడిగింది. కోర్టు కు సిబిఐ బెయిల్ రద్దు చేయాలా ? వద్ద అనే విషయం మీ ఇష్టం . మీకు విచక్షణ అధికారులు ఉన్నాయి. అని సిబిఐ తెలపటం కొసమెరుపు .

అక్ర‌మాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్ పై ఈ రోజు సీబీఐ కోర్టు విచార‌ణ జరిపింది . బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసి ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు సీబీఐ త‌మ అభిప్రాయాన్ని తెలిపింది.

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వదిలిపెడుతున్న‌ట్లు సీబీఐ మెమో దాఖ‌లు చేసింది. కోర్టు విచక్షణాధికారాల‌ మేరకు ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే, సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణ‌రాజు పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. దీంతో సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొన్నది .ఒక పక్క కృషంరాజు జగన్ బైలు రద్దు అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

హైదరాబాద్‌లో భారీ చోరీ..నగదు జోలికి వెళ్లని దొంగలు!

Drukpadam

అమెరికాకు అక్రమ వలస యత్నం.. వృద్ధుడిలా నటిస్తూ పట్టుబడ్డ భారత యువకుడు!

Ram Narayana

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు తెలంగాణ మావోయిస్టు అగ్రనేతల హతం

Ram Narayana

Leave a Comment