Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మనుషులంటే విసిగిపోయి రెండు దశాబ్దాలుగా గుహలోనే జీవితం!

మనుషులంటే విసిగిపోయి రెండు దశాబ్దాలుగా గుహలోనే జీవితం!
-20 ఏళ్లుగా అడవిలో జీవిస్తున్న పాంటా పెట్రోవిక్
-పెట్రోవిక్ సెర్బియా దేశస్తుడు
-సమాజంలో చెడు పెరిగిపోవడం పట్ల ఆవేదన
-ఆస్తులు పంచేసి అడవి బాటపట్టిన వైనం

సమాజానికి, తనకు సామరస్యం కుదరక ఓ వ్యక్తి అడవుల బాటపట్టాడు. కొండకోనల్లో జీవిస్తూ, జంతువులు, చేపలను వేటాడుతూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడి పేరు పాంటా పెట్రోవిక్. వయసు 70 ఏళ్లు. పెట్రోవిక్ సెర్బియా దేశస్తుడు. దినసరి వేతనంపై కూలీగా పనిచేసే పెట్రోవిక్ ప్రజల్లో పెరిగిపోతున్న చెడును చూసి భరించలేకపోయాడు. సమాజంలో జరిగే దారుణాలు అతడిని కలచివేశాయి.

వారిని మార్చడం తన వల్ల కాదని భావించి తానే వారికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆస్తులను ఇరుగుపొరుగు వారికి ఇచ్చేశాడు. రెండు దశాబ్దాల క్రితం జనవాసాలకు దూరంగా వెళ్లిపోయి ఓ కొండగుహలో జీవనం మొదలుపెట్టాడు. ఆ గుహలోనే రెండు బెంచీలను, ఓ టాయిలెట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం కోసం అడవిలో సంచరించడం, అక్కడికి దగ్గర్లోని చెరువులో చేపలు పట్టడం పెట్రోవిక్ దినచర్య. పుట్టగొడుగులను ఎంతో ఇష్టంగా తింటాడు.

 

 

అయితే, ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెట్రోవిక్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నాడు. దాంతో అతడి అరణ్య జీవనం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ తన గుహ వరకు వస్తుందన్న భయంతోనే వ్యాక్సిన్ తీసుకున్నానని ఈ సెర్బియా దేశస్తుడు తెలిపాడు. తాను నగర జీవితంలో ఇమడలేకపోయానని, కానీ ఈ అడవిలో ప్రశాంతంగా జీవిస్తున్నానని వివరించాడు.

 

Related posts

యూకేలో భారత సంతతి వైద్య విద్యార్థిని దారుణ హత్య…!

Drukpadam

కోదండరామ్ అవుట్ పల్లా,తీన్మార్ నువ్వా,నేనా?

Drukpadam

టెక్సాస్ లో మరో ఘోరం.. జనంపైకి దూసుకెళ్లిన కారు, ఏడుగురు మృతి!

Drukpadam

Leave a Comment