Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణం.. యువతిని దారి మళ్లించి అత్యాచారం!

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణం.. యువతిని దారి మళ్లించి అత్యాచారం
-ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి
-సృహ కోల్పోయిన యువతిని అక్కడే వదిలేసి పరారీ
-సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు

ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్న ఏమి లాభం …. సీసీ కెమెరాలు ఉన్న , పోలీస్ నిఘాపెరిగిన కామాంధులకు అవి లెక్క లేకుండా పోయాయి. గతంలో హైద్రాబాద్ లో ఒక వెటర్నరీ డాక్టర్ సంఘటన దేశాన్నే నివ్వెర పరిచేలా చేసింది. చివరకు ఆ మృగాళ్లను పట్టుకొని తగిన శిక్ష విధించారు. పోలీసులు …. అయినప్పటికీ ఈ నేరాలు ఘోరాలు ఆగటం లేదు …. ప్రత్యేకించి ఆటో డ్రైవర్లు లంపెన్ గ్యాంగ్ గా వ్యవహరిస్తున్నారు. నిన్న హైద్రాబాద్ లో జరిగిన ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఆటోలో తన ఇంటికి వెళ్లేందుకు ప్రయాణమైనా ఒక యువతిని ఆటోవాడు వెక్కించుకొని నిర్జీవ ప్రదేశానికి తీసుకోని వెళ్లి అత్యాచారం చేసి ఒక్కడే వదిలి వెళ్లిన సంఘటన యువతల భద్రతపై మరోసారి భయాందోళనలు కలిగిస్తుంది.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన యువతిని డ్రైవర్ దారి మళ్లించి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్‌నగర్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల యువతి మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విధులకు బయలుదేరిన ఆమె ఆటో ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆటోను దారి మళ్లించిన డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సాయంత్రం సమయంలో ఆమె తేరుకుని నేరుగా వెళ్లి జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇంకా షాక్‌లోనే ఉండడంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Related posts

నైజీరియాలో విషాదం.. పడవ బోల్తాపడి 76 మంది జలసమాధి!

Drukpadam

డబ్బు కోసం ఫడ్నవీస్ అర్ధాంగిని బ్లాక్ మెయిల్ చేసిన క్రికెట్ బుకీ కుమార్తె!l

Drukpadam

వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొలిక్కిరాని కేసు …

Drukpadam

Leave a Comment