Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాబూల్ లో సిక్కు గురుద్వారాను సందర్శించిన తాలిబన్లు!

కాబూల్ లో సిక్కు గురుద్వారాను సందర్శించిన తాలిబన్లు
ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తాలిబన్లు
సిక్కులు, హిందువుల్లో తీవ్ర ఆందోళన
ఓ గురుద్వారాలో తలదాచుకుంటున్న 200 మంది సిక్కులు
ఎలాంటి హాని తలపెట్టబోమన్న తాలిబన్లు

తాలిబన్లు ఆఫ్ఘన్ అశాంతి సృష్టిస్తారనే భావన పోగొట్టుకోవాలని చూస్తున్నారు. కాబుల్ లో ప్రవేశించిన అనంతరం వారు ఎవరికీ హాని తలపెట్టబోమని ప్రకటిస్తున్నారు. అధికార మార్పిడి శాంతియుతంగా జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ అధ్యక్షుడు కర్జాయ్ ని కలిసి మంతనాలు జరిపారు. ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ లో ఉన్న సిక్కు గురుద్వార్ ని సందర్శించారు. అందులో దలదాచుకున్న సిక్కులకు ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. కాబుల్ గురుద్వారాలో దాదాపు 200 మంది వరకు సిక్కులు తలదాచుకున్నట్లు తెలుస్తుంది.

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న నేపథ్యంలో అనేకమంది సిక్కులు, హిందువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, తాలిబన్లు తాజాగా రాజధాని కాబూల్ లోని ఓ సిక్కు గురుద్వారాను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాలిబన్లు ఆ గురుద్వారాలోని సిక్కు మత పెద్దలను కలిసి వారికి స్నేహ హస్తం చాచారు. తాము సిక్కులకు ఎలాంటి హాని తలపెట్టబోమని, సిక్కులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉండొచ్చని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

ఢిల్లీలోని సిఖ్ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా దీనిపై స్పందిస్తూ, ఆఫ్ఘన్ లోని గురుద్వారా వర్గాలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, తాలిబన్ నేతలు వారి భద్రతకు హామీ ఇచ్చినట్టు తెలిసిందని వెల్లడించారు. కాగా, కాబూల్ గురుద్వారాలో 200 మంది సిక్కులు చిక్కుకుపోయారన్న వార్తల నేపథ్యంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వారి పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.

Related posts

ఈటల మళ్లీ హరిశ్ ప్రస్తావన…..

Drukpadam

ఈ నెల 7న మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్య‌ట‌న‌…

Drukpadam

ఆవిష్కరణల్లో మేటి ఐఐటీలు.. దేశంలోని టాప్-10 విద్యాసంస్థలు ఇవే!

Drukpadam

Leave a Comment