Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రతికేసులోనూ అరెస్టు తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

ప్రతికేసులోనూ అరెస్టు తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-ఉత్తరప్రదేశ్ బిజినెస్‌మ్యాన్ ప్రమోద్ కుమార్ దూబే కేసులో సుప్రీం వ్యాఖ్యలు
-వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని కామెంట్
-సెక్షన్ 170ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న అత్యున్నత న్యాయస్థానం
-దర్యాప్తులో సహకరిస్తున్న నిందితుడి అరెస్టు కరెక్ట్ కాదన్న కోర్టు
-చట్టం అనుమతించింది కదా అని అరెస్టు చేయడం తప్పన్న ధర్మాసనం

ప్రతి కేసులో నిందితుడిని అరెస్టు చేయడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. చట్టం అనుమతిస్తుంది కదా అని వ్యక్తిగత స్వేచ్ఛను నాశనం చేయడం కోసం అరెస్టును ప్రభుత్వాలు వాడుకోవడం తగదని కోర్టు తెలిపింది. భారత రాజ్యాంగంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ప్రాథమికాంశమని కోర్టు గుర్తుచేసింది.

‘‘నిందితుడి కస్టోడియల్ దర్యాప్తు అవసరమైనప్పుడు, అత్యంత క్రూరమైన నేరం కేసులో, సాక్షులను నిందితుడు ప్రభావితం చేయగలిగిన సందర్భంలో, లేదంటే నిందితుడు పారిపోయే ప్రమాదం ఉన్నప్పుడో మాత్రమే అరెస్టు అవసరం. అరెస్టు అనేది చట్టబద్ధం అయినంత మాత్రాన.. అది తప్పనిసరేమీ కాదు’’ అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేష్ రాయ్‌ల ధర్మాసనం పేర్కొంది. అంతేకాక అరెస్టు చేసే అధికారానికి, దాన్ని అమలు చేయడంలో న్యాయబద్ధతకు మధ్య తేడా ఉండాలని జడ్జిలు అభిప్రాయపడ్డారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ దూబే వేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. బెయిలు కోరుతూ ఆయన వేసిన పిల్‌ను అలహాబాద్ హైకోర్టు జులైలో తిరస్కరించింది. 2007లో యూపీ ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టుల్లో జరిగిన కుంభకోణం కేసులో దూబేపై కేసు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మ్యూజియంలు, పార్కులు నిర్మించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనిలోనే కొన్ని మోసాలు జరిగినట్లు కేసు నమోదైంది.

ఏడేళ్ల కిందటి కేసులో దర్యాప్తునకు దూబే సహకరిస్తున్నారని, అలాంటప్పుడు ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని దూబే తరఫు న్యాయవాదులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 170ని తప్పుగా అర్థం చేసుకున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘కస్టడీ’ అనే పదాన్ని ‘అరెస్టు’గా అర్థం చేసుకోవడం జరిగిందని పేర్కొంది.

Related posts

కొందరు మాట్లాడతారు.. పనిచేయరు: కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సెటైర్లు…

Drukpadam

అంతర్జాతీయ ప్రయాణికులపై కీలక నిబంధనను ఎత్తివేసిన కేంద్రం!

Drukpadam

తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్.. కుమారుడి ప్రాణం తీసింది!

Drukpadam

Leave a Comment