తుపాకీతో బెదిరించి క్షణాల వ్యవధిలో చైన్‌లాక్కెళ్లిన యువకులు..
-మధ్యప్రదేశ్‌లో ఘటన
-ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళను అడ్డగింత
-నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్ కలకలం
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళను నడిరోడ్డుపై అడ్డగించిన ఇద్దరు యువకులు అందరూ చూస్తుండగానే ఆమెకు తుపాకీ చూపి బెదిరించి, ఆమె మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. కొన్ని సెకన్లలో పని కానించి బైక్‌పై పారిపోయారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టి మహిళ మెడలో నుంచి చైన్ లాక్కున్న తీరు కలకలం రేపుతోంది. ఆ మహిళ వెనుక ఆమె కుమారుడు ఉన్నప్పటికీ నిందితులను అడ్డుకోలేకపోయాడు. అక్కడి రోడ్డు మీద వెళ్లేవాళ్లు కూడా దుండగులను ఆపలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కుమారుడిని మహిళ ట్యూషన్ వద్ద విడిచిపెట్టేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.