Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రైతులకు భూరి సహాయం!

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రైతులకు భూరి సహాయం!
-రైతులకు 2 కోట్ల విలువైన 23 ట్రాక్టర్ల పంపిణీ!
-వాటిని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగింత
-గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్న అవినాశ్ రెడ్డి
-ఎమ్మెల్యే కి పలువురి అభినందనలు

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రైతుల కోసం 23 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రూ. 2 కోట్ల విలువైన ఈ ట్రాక్టర్లను 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాశ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ, శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఎమ్మెల్యే కాకముందు నుంచీ ఆయన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. దివంగత వైయస్ మాదిరి తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు.

శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నేత నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. రాబందులా శవాల కోసం లోకేశ్ ఎదురు చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ లోకేశ్ వాలిపోతున్నాడని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.

Related posts

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత!

Drukpadam

బీహార్‌లో ఆర్ఆర్‌బీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకం.. రైలు దహనం!

Drukpadam

టీటీడీ వెబ్ సైట్ పేరు మారింది!

Ram Narayana

Leave a Comment