హుజూరాబాద్ నివురుగప్పిన నిప్పులా ఉంది.. 2006 రిపీట్ అవుతుంది: ఈటల!
-హుజూరాబాద్ లో దుర్మార్గాలు, దురాగతాలు చెల్లవు
-ఎవరికి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదు?
-చాకలి ఐలమ్మ ప్రజల కోసం ప్రాణం అర్పించారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో మరు సీఎం కేసీఆర్ పై భగ్గు భగ్గు మన్నారు.హుజురాబాద్ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని అన్నారు. 2006 ఉపఎన్నికల్లో ఏమి జరిగిందో అదే రిపీట్ అవుతుందని అన్నారు. ఇక్కడ ప్రజలముంచి ద్రుమార్గాలు ,దురాగతాలు చెల్లని అన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని ఏ ఉద్దేశ్యం తో జరపటంలేదో, ఎవరికీ భయపడుతున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గం నివురుగప్పిన నిప్పులా ఉందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దురాగతాలు హుజూరాబాద్ లో చెల్లవని వ్యాఖ్యానించారు. చాకలి ఐలమ్మ ముఖ్యమంత్రి కాదని… అయినప్పటికీ ప్రజల కోసం ప్రాణం అర్పించారని చెప్పారు. ఆలాంటి త్యాగధనులు కన్నగడ్డ తెలంగాణ అని మోసాలకు దోపిడీకి ,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలిచిన చరిత్ర తెలంగాణ సొంతమని అన్నారు.
ఈ ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతేనని అన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంను అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికి భయపడి విమోచన దినాన్ని జరపడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు చరిత్ర వీరులను, చరిత్ర హీనులను గుర్తుంచుకుంటారని… హిట్లర్ చరిత్ర హీనుడైతే, మన శ్రీకాంతాచారి చరిత్ర వీరుడని అన్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న హుజూరాబాద్ లో 2006 ఉపఎన్నిక హిస్టరీ రిపీట్ అవుతుందని చెప్పారు. ప్రజలను మోసగించేందుకు టీఆర్ యస్ ప్రయత్నిస్తుందని ,కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థిలో ప్రజలు లేరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దళితబందు తనవల్లనే అమలు జరుగుతున్నదని , తమ దళిత బిడ్డలకు ఉపఎన్నికల రూపంలో 10 లక్షల చొప్పున అందివ్వడం సంతోషదాయకని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు.