Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి: బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్…

టీఆర్ యస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి బీజేపీ నేత : ప్రకాశ్ జవదేకర్….
-2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో యుద్ధమే
-త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
-కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
-రాష్ట్రానికి విచ్చేసిన ప్రకాశ్ జవదేకర్
-టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైనం
-హుజూరాబాద్ లో బీజేపీదే విజయం అని వెల్లడి

తెలంగాణాలో బీజేపీ నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడంలేదు ….పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తున్నారు…. 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. తెలంగాణాలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఢంకా భజాయిస్తున్నారు. అందుకే దేన్నీ వదిలి పెట్టడంలేదు. హుజురాబాద్ ఎన్నికైన , విమోచన దినోత్సవం అయినా ,బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అయినా టీఆర్ యస్ పై నిప్పులు చెరుగుతున్నారు. విమోచనదినోత్సవానికి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం 2023 లో అధికారం బీజేపీ దేఅన్నారు . అయితే అయన టీఆర్ యస్ పై పెద్దగా విమర్శలు చేయకపోవడంపై టీఆర్ యస్ తో బీజేపీ కి ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ మంత్రి టీఆర్ యస్ ప్రభుత్వంపైనా , కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు.ప్రకాష్ జవదేకర్ సైతం టీఆర్ యస్ విరుచుకపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చి వేయాలని పిలుపునిచ్చారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక పై కూడా జవదేకర్ స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని ఉద్ఘాటించారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో యుద్ధం ఖాయమని స్పష్టం చేశారు.

ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి అంటూ ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వారి ఖాళీలను ఎక్కడ భర్తీ చేశారని నిలదీశారు. తెలంగాణలో ఏ వర్గానికి న్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో నేడు ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ లో పాదయాత్ర సాగుతుండగా, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జవదేకర్ ప్రసంగించారు. బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్ర గతిని మార్చివేస్తుందని స్పష్టం చేశారు.

Related posts

అప్పు చేసే పేద‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు..డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు!

Drukpadam

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీ, యూపీ, కోల్ కతాల్లో భారీ నిరసనలు.. 

Drukpadam

డ్రగ్స్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు …సిపిఐ నారాయణ ధ్వజం !

Drukpadam

Leave a Comment