Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చీర కట్టుకుంటే …రెస్టారెంట్ లోకి నో ఎంట్రీ …ఇది ఎక్కడో కాదు దేశరాజధాని ఢిల్లీలో!

చీర కట్టుకుంటే …రెస్టారెంట్ లోకి నో ఎంట్రీ …ఇది ఎక్కడో కాదు దేశరాజధాని ఢిల్లీలో!
-చీర కట్టుకుందని రెస్టారెంట్లోకి రానివ్వని సిబ్బంది.. మండిపడుతున్న నెటిజన్లు
-కుమార్తె పుట్టినరోజుకు టేబుల్ బుక్ చేసిన మాజీ జర్నలిస్టు
-రెస్టారెంటు రూల్స్ ఒప్పుకోవంటూ వాదించిన మేనేజర్
-చీర కట్టుకున్న ఆమెను లోపలకు అనుమతించడం కుదరదన్న వైనం
-సోషల్ మీడియాలో వెల్లడించిన అనితా చౌధరి

కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అనుకుంది ఒక ప్రముఖ మాజీ జర్నలిస్టు. ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక కుమార్తెను లోపలకు అనుమతించిన సిబ్బంది ఆమెను మాత్రం ఆపేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమె చీర కట్టుకొని ఉందని, రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని చెప్పారు. దీంతో ఆమెతోపాటు కుటుంబసభ్యులు కంగుతిన్నారు …

తన చీర కూడా క్యాజువల్ డ్రస్సే కదా అని ఆమె వివరించినా వాళ్లు ఒప్పుకోలేదు. చివరకు రెస్టారెంట్ మేనేజర్ కూడా వచ్చి ఆమెనే తప్పుబట్టాడు. ఆమె మాజీ జర్నలిస్టు అనితా చౌధరి. ఈ ఘటన జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో. ఖేల్ గావ్‌లో ఉన్న ఆక్విలా అనే రెస్టారెంట్ వద్ద ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అనిత, ఆమె కుమార్తె ఎంత వివరించినా ఆ రెస్టారెంటు సిబ్బంది మాత్రం ఆమెను లోపలకు అనుమతించడానికి ససేమిరా అన్నారు. దీంతో బుక్ చేసిన టేబుల్ వదిలేసుకొని ఇంటికి తిరిగెళ్లిపోవాల్సి వచ్చిందని అనిత చెప్పారు.

ఈ మొత్తం వివాదాన్ని వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు తను వచ్చిన విధానాన్ని చెప్పేందుకు ఒక సెల్ఫీ కూడా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్విలా రెస్టారెంటుపై మండిపడుతున్నారు.

ఒకరైతే ఈ రెస్టారెంట్‌కు ప్రతిచోటా చెత్త రేటింగే ఉందని చెప్పారు. గూగుల్‌లో 1.1/5 రేటింగ్ ఉండగా, జొమాటోలో 2/5 రేటింగ్ ఉందని చెప్పిన సదరు యూజర్.. ఈ రెస్టారెంట్ ఇలా తప్పు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని వెల్లడించారు. పాత రివ్యూలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు. అనిత షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Related posts

ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహం….

Drukpadam

రాజకీయాల్లో చంద్రబాబు అంత పనికిమాలిన నేత మరొకరు లేరు: బొత్స

Drukpadam

తమిళనాడులో విషాదం… నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిల మృతి!

Drukpadam

Leave a Comment