Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాకు సభలో ప్రాధాన్యం ఇవ్వండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్!

మాకు సభలో ప్రాధాన్యం ఇవ్వండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్!
-అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ భేటీ
-హాజరైన ఉత్తమ్, పార్టీ ఎమ్మెల్యేలు
-సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని డిమాండ్

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీసే ఎత్తుగడలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సమావేశమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజుల పాటు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దళితబంధు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన, ధరణిలో సమస్యలు, పోడు భూముల వ్యవహారంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ కు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇటీవల మరణించిన పలువురు నేతలకు నివాళులు అర్పించిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

మాట్లాడే అవకాశం నాకెందుకు ఇవ్వడం లేదు?: సొంత పార్టీపై జగ్గారెడ్డి ఆగ్రహం
-తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరం
-ఇతర నేతలపై జగ్గారెడ్డి విమర్శలు
-గజ్వేల్ సభలో అవమానించారని వెల్లడి
-తెలంగాణలో తనకు సొంత ఇమేజి ఉందని స్పష్టీకరణ

 

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అసంతృప్తి గళం వినిపించింది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న తనను అవమానిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లదలచుకుంటే ఎవరు అడ్డుకోగలరని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తరఫున 4 పర్యాయాలు గెలిచిన వారికే గౌరవం దక్కని పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని తానేనని, కానీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు.

గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందని, గీతారెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గీతారెడ్డి అంటే తనకు గౌరవం ఉందని, కానీ ఆ సభలో ఆమె తన పట్ల వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొన్నారు.

“ఎవరి ప్రోద్బలంతో గీతారెడ్డి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు? కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది?” అని జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణలో తనకు సొంత ఇమేజి ఉందని, పార్టీ తోడ్పాటు లేకుండానే రెండు లక్షల మందితో సభ పెట్టగలనని స్పష్టం చేశారు.

Related posts

రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పిన సోము వీర్రాజు!

Drukpadam

మోదీ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కని ప్రముఖులు వీరే…

Ram Narayana

బీజేపీ గెలుపు బ‌ల‌మేంటో చెప్పిన‌ దీదీ!

Drukpadam

Leave a Comment