తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఆశీస్సులు మాకు చాలా అవసరం: నాగార్జున!
-లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్
-హైదరాబాదులో కార్యక్రమం
-హాజరైన నాగార్జున
-చిత్రబృందానికి అభినందనలు
సినీ ఇండస్ట్రీ కి తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు , ప్రత్యేకించి ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు , పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకుపడిన నేపథ్యంలో సీనియర్ నటుడు నాగార్జున రెండు తెలుగు రాష్ట్రాల ఆశీస్సులు చిత్ర పరిశ్రమకు కావాలని ఇప్పటివరకు ప్రభుత్వాలు చల్లని చూపు చేశాయని ఇకముందు కూడా ఇదే కావాలని , వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు . ఆయన చేసిన అప్పీల్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం వినమ్రపూర్వకంగా ఉండటం తో సినీ రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రీలీజ్ వేడుకలో చేసిన ప్రసంగం రాజకీయ ప్రసంగంగా సాగగా నాగార్జున విజ్ఞప్తి ని పలువురు ప్రసంశించారు. సినీ టిక్కెట్ల విషయం గని మిగతా విషయాలు గాని ప్రస్తావించకుండానే ప్రభుత్వాల ఆశీస్సులు కావాలని కోరడం ఆయన మెచూరిటీని తెలియజేస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి కూడా దాదాపు ఇదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఇటీవల రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ చిత్రబృందం హైదరాబాదులో మ్యాజికల్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఓవైపు గులాబ్ తుపాను, మరోవైపు కరోనా… ఇన్ని విపత్కర పరిస్థితుల్లోనూ లవ్ స్టోరీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రేక్షకులకు సినిమాను ఎంతో ప్రేమిస్తారని అని వివరించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దీవెనలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు తమను మంచిచూపు చూశాయని, ఇకముందు కూడా ఆ చల్లని చూపు కొనసాగాలని నాగార్జున ఆకాంక్షించారు.