Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బద్వేల్ బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి …వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ!

 

బద్వేల్ బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి …వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ!
-అక్టోబరు 30న బద్వేలు ఉప ఎన్నిక
-బద్వేల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ సమావేశం
-హాజరైన కడప జిల్లా ప్రజాప్రతినిధులు
-సుధను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు
-పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ

బద్వేలు ఉప ఎన్నికపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. 2019లో కంటే అత్యధిక మెజారిటీతో దాసరి సుధను గెలిపించాలని పిలుపునిచ్చారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని బద్వేలు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో అక్టోబరు 30న ఉప ఎన్నిక నిర్వహిస్తుండడం తెలిసిందే.

బద్వేల్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ నేతలతో చర్చించారు. ఇవాళ ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కడప జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారమే ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 1 నుంచి 8 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 2న ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ వైసీపీ ,టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.

Related posts

ప్రియాంక నిరుద్యోగుల నిరసన సభపై కాంగ్రెస్ గంపెడు ఆశలు…

Drukpadam

ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి!

Drukpadam

చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా ?

Drukpadam

Leave a Comment