Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భారతీయ జనతా పార్టీని ముక్కలు ముక్కలు చేసే వ్యక్తిని : కన్నయ్య కుమార్!

భారతీయ జనతా పార్టీని ముక్కలు ముక్కలు చేసే వ్యక్తిని : కన్నయ్య కుమార్!
-బీజేపీ గాడ్సే ల పార్టీ …గాంధీ ని అందరిముందు పొగిడి ..గాడ్సే ను ఆరాధిస్తారు
-నిన్ననే కాంగ్రెస్ లో చేరిన కన్నయ్య కుమార్
-బీజేపీకి ప్రత్యాన్మాయం కాంగ్రెస్సే …దాన్ని బలపరచడం ద్వారానే బీజేపీని ఓడించగలం
-రాహుల్ గాంధీ పై కన్నయ్య ప్రసంశలు
-కన్నయ్య కుమార్ మరో సిద్దు లాంటి వారని ఆర్జేడీ విమర్శ

భారతీయ జనతా పార్టీ నేతలు తనను టుక్‌డే టుక్‌డే గ్యాంగ్ (విచ్ఛిన్నకారి) వ్యక్తినని అన్నారని, వాళ్లు అన్నట్టుగానే తాను అదేనని, కాకపోతే బీజేపీని విచ్ఛిన్నం చేసే టుక్‌డే టుక్‌డే అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ అన్నారు. శుక్రవారం ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని, మరే పార్టీ ఆ పని చేయలేవని అన్నారు. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే అది బీజేపీకి లాభం అవుతుంది. ఈ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌ను బలపరిస్తే బీజేపీని ఓడించొచ్చు. కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే అవన్నీ ప్రాంతీయ పార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీని ఓడించడానికే నేను పోరాడుతున్నాను. కాంగ్రెస్‌తో అది సాధ్యం అవుతుంది. ఒకవేళ అలా జరక్కపోతే నా పోరాటం నుంచి తప్పుకుంటాను అని కన్హయ్య కుమార్ అన్నారు.

ఇక రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధఈ జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన వ్యక్తి. చాలా దయగల వ్యక్తి కూడా. ఆయనెప్పుడూ మా అమ్మనాన్నల ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆయన చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి. అంతే కాదు, చాలా ధైర్యవంతుడు, నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు అని అన్నారు.

ఇక మోదీ, అమిత్‌షా గురించి మాట్లాడుతూ మోదీ-అమిత్ షా ద్వయం నాదూరం బనాయే జోడి లాంటిది. వాళ్లకు జాతి పిత గాడ్సేనే కానీ మహాత్మ గాంధీ కాదు. హిందుత్వ భావజాలమున్న చాలా పార్టీలు, గ్రూపులు కూడా అలాగే ఆలోచిస్తాయి. వాళ్లు గాంధీని విశ్వసించరు. ఒక్క సందర్భంలో అయితే గాంధీ గురించి చెప్తారు. అది అమెరికా అధ్యక్షుడి ముందు. బీజేపీ నన్ను టుక్‌డే టుక్‌డే గ్యాంగ్ అంటుంది. నిజమే.. నేను బీజేపీని టుక్‌డే టుక్‌డే చేసే వాడినే అని కన్హయ్య కుమార్ అన్నారు.

కాంగ్రెస్ కండువా కప్పుకున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తీవ్ర స్థాయిలో మండపడింది. కన్హయ్య కూడా మరో నవజ్యోత్ సింగ్ సిద్ధూలా మారతారని, కాంగ్రెస్‌ను బిహార్‌లో నాశనం చేస్తారని విమర్శలు గుప్పించింది. ఆర్జేడీ సీనియర్ నాయకుడు శివానంద్ తివారి మాట్లాడుతూ కన్హయ్య చేరికతో కాంగ్రెస్‌కు జరిగే ప్రయోజనం ఏం లేదని అన్నారు. ఈయనే గతంలో కాంగ్రెస్‌ను మునిగిపోతున్న నావ అని వ్యాఖ్యానించారు.

సీపీఐతో పోల్చుకుంటే కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ. దాన్ని కాపాడాలి. కానీ దానికి కన్హయ్య సరిపోడు. అతడు మరో నవజ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి వాడు అని శివానంద్ తివారి అన్నారు. వాస్తవానికి తేజస్వీతో మాట్లాడి కన్హయ్య ఆర్జేడీలో చేరాల్సిందని, అలా కాకుండా కాంగ్రెస్‌లో చేరడంపై ఆర్జేడీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

పోయిన ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. తేజస్వీ, కన్హయ్య కుమార్‌లు ఆ కూటమికి కలిసి పని చేసిన విషయం తెలిసిందే

Related posts

బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించలేను: శరద్ పవార్ స్పష్టీకరణ!

Drukpadam

కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలు అంటున్న కేశినేని నాని…

Drukpadam

‘ఆర్ఎస్ఎస్’పై సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒవైసీ!

Drukpadam

Leave a Comment