Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ బాతు సంపాదన నెలకు రూ 3,34,363 పైనే …..

సోషల్ మీడియాలో పాపులర్.. ఈ బాతు జీతం నెలకు రూ.3 లక్షలు!

  • పెన్సిల్వేనియాలో ‘డంకిన్ డక్స్’ చాలా ఫేమస్
  • మంచ్‌కిన్ అనే బాతుతో అనుభవాలు పంచుకుంటున్న టీనేజర్
  • లక్షల్లో పెరిగిన ఫాలోవర్లతో భారీ సంపాదన

బంగారు బాతు గుడ్డ కథ గురించి విన్నాం …కానీ నేడు నిజంగా బాతు అంతకన్నా ఎక్కువే … ఎందుకంటే అమెరికా లోని ఒక బాతు నెల సంపాదన రూ 3,34,363 ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజంగా ఇది నిజం …వివరాల్లోకి వెళ్ళితే ….

ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువు ఏది? అంటే పెన్సిల్వేనియా ప్రజలు టక్కున చెప్పే సమాధానం ‘మంచ్ కిన్’. ఇదో బాతు. 20 ఏళ్ల అమ్మాయికి క్రిస్సీ ఎల్లీస్ పెంచుకుంటోంది. ఆమెకు చిన్నప్పటి నుంచి బాతులంటే ఇష్టం. టీనేజ్‌లో ఉండగా ‘మంచ్ కిన్’ అనే బాతు ఆమె వద్దకు చేరింది.

వీరిద్దరికి కలిపి ‘డంకిన్ డక్స్’ అని ఒక సోషల్ మీడియా ఖాతా కూడా తెరిచేసింది క్రిస్సీ. తనతోపాటు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు తిప్పుతూ మంచ్ కిన్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది. ఇలా ఈ ‘డంకిన్ డక్స్’ బాగా ఫేమస్ అయిపోయారు. వీరికి ప్రస్తుతం టిక్‌టాక్‌లో 2.7 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మంది ఫాలోవర్లు తయారయ్యారు.

దీంతో వీరిద్దరి సంపాదన కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం వీరు నెలకు రూ. 3,34,363పైగా సంపాదిస్తున్నారు. వీరు ఎంతలా పాపులర్ అయ్యారంటే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వార్తాసంస్థ కూడా ‘కష్టపడి పనిచేసే పెట్’ అంటూ మంచ్‌కిన్‌పై ఓ కథనం ప్రచురించింది.

Related posts

టీచర్ పై హైస్కూల్ స్టూడెంట్ దాడి.. అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం!

Drukpadam

యుద్ధం ఫలితం … బూడిదకుప్పగా మారిన ఉక్రెయిన్ సిటీ!

Drukpadam

కుక్కపిల్లల కోసం ఎలుగుబంటిని లెక్కచేయని అమెరికా అమ్మాయి!

Drukpadam

Leave a Comment