Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ వ్యాపితంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు…

తెలంగాణ వ్యాపితంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు…
అందంగా పేర్చిన పూలతో ఎంగిలి బతుకమ్మ ఉత్సవాలు
ఊరూవాడలు ఏకమైనా వేళ
ఆడపడుచుల ఆటలపాటలు ,తప్పట్లు ,పాటలతో హెరెత్తిన తెలంగాణ

 

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. అందంగా పేర్చిన పూలతో ఆడపడుచుల ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలు పల్లెలు పట్టణాలు అనే బేధం లేకుండా ఆటలపాటలతో హోరెత్తాయి. మొదటి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందంతో జరుపుకున్నారు.

 

రైల్వే గేట్ హనుమాన్ టెంపుల్ లో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆఫీసర్ గెల్లా కృష్ణవేణి , ఆర్యవైశ్య సంఘం నాయకులు రాయపుడి వరలక్ష్మి , సత్యవతి , సక్కుబాయ్ , స్వరూప మరియు భక్తులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలలో పాల్గొని విజయవంతం చేశారు .

 

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ స్కూల్లో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యతిధిగా పోలీస్ కమిషనర్ సతీమణి స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనన్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, మహిళలు పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు.

కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శేషగిరిరావు , ఉపాధ్యాయులు , విద్యార్థినిలు పాల్గొన్నారు.

 

Related posts

దలైలామాతో భేటీ అయిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్!

Drukpadam

ఈ బాతు సంపాదన నెలకు రూ 3,34,363 పైనే …..

Drukpadam

Drukpadam

Leave a Comment