బీజేపీజాతీయ కార్యవర్గంలో తెలుగువారికి పెద్దపీట!
-తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డిలకు చోటు
-ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు స్థానం
-జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి నియామకం
-జాతీయ కార్యవర్గ ఆహ్వానితులుగా విజయశాంతి , ఈటల రాజేందర్
బీజేపీ జాతీయకార్యవర్గంలో తెలుగువారికి పెద్ద పీట వేశారు. ప్రత్యేకించి తెలంగాణకు సింహభాగం పదవులు లభించాయి .2023 లో తెలంగాణ లో అధికారంలోకి రావాలని కళలు కంటున్న బీజేపీ అందుకు అనుగుణంగా పార్టీ పదవులను కేటాయించింది. డీకే అరుణకు గతంలో లాగానే జాతీయ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టగా , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లతో పాటు రాగ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు , మాజీ ఎంపీ వివేక్ ను కూడా జాతీయకార్యవర్గంలోకి తీసుకున్నారు. విజయశాంతి , ఈటల రాజేందర్ లకు జాతీయకార్యవర్గంలో శాశ్విత ఆహ్వానితులుగా ఎంపిక చేశారు.
ఇక ఆంధ్రా ప్రదేశ్ నుంచి ఒక్క కన్నా లక్ష్మి నారాయణను జాతీయకార్యవర్గంలోకి తీసుకున్నారు. గతంలో లాగానే పురందరేశ్వరి ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరో నేత సత్యనారాయణ మూర్తిని జాతీయ కార్యదర్శి గా నియమించారు. అంటే తెలంగాణ నుంచి 7 గురు జాతీయ కార్యవర్గంలో ఉండగా , ఆంధ్ర నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే చోటు లభించింది.
2023 లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల బీజేపీ అధిష్టానం తెలంగాణ పై ఫోకస్ పెట్టింది. అందుకే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు .
జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యవర్గంలో తెలుగువారికి పెద్దపీట వేశారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావులకు చోటు లభించింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు స్థానం కల్పించారు.
ఆఫీస్ బేరర్లలో తెలంగాణ నుంచి డీకే అరుణను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపిక చేశారు. జాతీయ కార్యదర్శిగా ఏపీ నుంచి సత్యకుమార్ ను నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్ లకు స్థానం లభించింది.