Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ బరిలో 37 మంది … తప్పుకున్న ఈటల భార్య జమున!

హుజురాబాద్ బరిలో 37 మందితప్పుకున్న ఈటల భార్య జమున!
నెల 30 హుజూరాబాద్ ఉప ఎన్నిక
నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
నామినేషన్లు వెనక్కి తీసుకున్న ముగ్గురు అభ్యర్థులు
బరిలో 39 మంది అభ్యర్థులు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుండగా, నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అర్ధాంగి ఈటల జమున తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లింగారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి రాజ్ కుమార్ కూడా తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మూడు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం హుజూరాబాద్ బరిలో 37 మంది అభ్యర్థులు మిగిలారు. ప్రధానంగా టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి పోటీలో ఉన్నారు.

నామినేషన్ ల ఉపసంహరణలు అనంతరం బరిలో ఉండే అభ్యర్థులు తేలడంతో ప్రచార వేగం పుంజుకుంది . ప్రధానంగా టీఆర్ యస్, బీజేపీ , కాంగ్రెస్ లు పోటీ పడుతుండగా బీజేపీ అభ్యర్థీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ , టీఆర్ యస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ , కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. అయితే బీజేపీ , టీఆర్ యస్ అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది. ఇప్పటికే ఈ రెండు పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడప తట్టారు. గత మూడు నెలలుగా ఇక్కడ ఈ రెండు పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ యస్ ప్రచార భాద్యతలను రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్ రావు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. దళిత బందు పథకం ద్వారా అన్ని దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల పథకం పై టీఆర్ యస్ ఎంతో ఆశలు పెట్టుకున్నది . అవి కాకుండా నియోజకవర్గంలో ఉన్న చిన్న చితక లీడర్లను కూడా తమవైపు తిప్పుకునే పనిని టీఆర్ యస్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. బీజేపీ కూడా టీఆర్ యస్ లో ఉన్న చోటామోటా లీడర్లను తమవైపుకు తిప్పుకున్నది రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం తో పాటు తమ పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైయ్యాయి. బీజేపీ తరుపున జితేందర్ రెడ్డి కి ఇంచార్జి భాద్యతలు అప్పగించారు. ఈటల తానే అన్నిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ , టీఆర్ యస్ పార్టీలకు ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికకు మరో 15 మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Related posts

వి.హనుమంతరావుకు ఫోన్ చేసిన సోనియాగాంధీ…

Drukpadam

ప్రశాంత్ కిషోర్ రాజకీయపార్టీ పెట్టడానికి కేసీఆర్ ప్రోద్బలం ఉందా?

Drukpadam

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌!

Drukpadam

Leave a Comment