Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీకే రాహుల్ పై ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యూ టర్న్ కు కారణం ఏమిటి ?

పీకే రాహుల్ పై ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యూ టర్న్ కు కారణం ఏమిటి ?
ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను అంగీకరిస్తే ప్రచారం చేస్తానన్నారుగా
ప్రియాంక శక్తిసామర్థ్యాలు చూసి రాహుల్‌ కు గాంధీకి వణుకు ఎందుకు ?
ప్రియాంకగాంధీ.. ఇందిరను పోలి ఉంటారని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి ?
2017 యూపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించకపోవడానికి కారణం అదేనా ?
పాట్నాలో రాహుల్‌ను తొలిసారి కలిశా

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు ప్రియాంక అంటే వణుకు అని , ఆమె అచ్చం వారినానమ్మ ఇందిరా గాంధీని పోలిఉంటుందని అందువల్ల ఆమె ఎదుగుదలను రాహుల్ అంగీకరించలేదని అర్థం వచ్చే రీతిలో పీకే చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో ఆశక్తిగా మారాయి. పీకే ఎందుకు యూ టర్న్ తీసుకున్నారనేది ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ దారి తీసింది . తన చెల్లి ప్రియాంకను చూసి రాహుల్ కు వణుకు అనేది నిజమేనా ? అసలు పీకే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కొద్దినెలల క్రితం ఆయనే ప్రతిపక్షాలు అన్ని కలిసి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను అంగీకరిస్తే తాను ఎన్నికల్లో పనిచేస్తానని చెప్పి సంచనలం రేపిన విషయం విదితమే . ప్రశాంత్ కిషోర్ తాజాగా ప్రియాంక అంటే రాహుల్ కు వణుకు అని అందుకే ఆమెను గత యూ పీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నారని , అయితే ఆయన చేరికని కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల కన్నయ్య కుమార్ , జిగ్నేష్ మేనని లు కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా కూడా ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన చేసిన వివాద స్పద వ్యాఖలతో ఆయన కాంగ్రెస్ లో చేరడం లేదని తేటతెల్లం అయింది. అంతే కాదు రాహుల్ గాంధీ అంటే కూడా పీకే ఎలాంటి అభిప్రాయం ఉందొ అర్థం అవుతుంది.

ఓ టీవీ చానల్‌తో పీకే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శక్తిసామర్థ్యాలు చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని అన్నారు. ప్రియాంక అచ్చం నానమ్మ ఇందిరా గాంధీని పోలి ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నారు. అందుకనే ఆమెను చూసి రాహుల్ భయపడుతున్నారని అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించకపోవడానికి కారణం అదేనన్నారు. రాహుల్‌ను తొలిసారి పాట్నాలో కలిశానని, అప్పుడే కాంగ్రెస్‌ కోసం పనిచేయమని అడిగారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. పీకే చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి.

Related posts

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: శశిథరూర్…

Drukpadam

రసకందాయంలో గోవా బీజేపీ…

Drukpadam

రైతు కంట కన్నీరు చిందిన రాజ్యం బాగుపడదు: సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ…

Drukpadam

Leave a Comment