Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబు పేల్చిన షబ్బీర్ అలీ

కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు అయ్యాయి: కేటీఆర్

రేవంత్ , ఈటల రహస్య సమావేశం కేటీఆర్

ఈటల ,రేవంత్ సమావేశంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు

గాంధీభవన్ లో గాడ్సే …ప్రగతి భవన్ లో గాడ్సే కొత్త అవతారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు తమకు టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ అంటుంది. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లోకి వెళ్లిన వారు కేవలం 12 మంది కాగా 15 మంది ఎక్కడ నుంచి వస్తారనేది ఆశక్తికర విషయం. మరి షబ్బీర్ అలీ చెప్పినట్లు టీఆర్ యస్. నుంచి వస్తారా అంటే ఆ అవకాశమే లేదు. అధికారంలో ఉన్న పార్టీలోనుంచి అధికారం వస్తుందో రాదో తెలియని పార్టీలోకి వస్తారా?

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందని అన్నారు.   గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

హుజారాబాద్ ఎన్నికల నేపద్యంలో రాజకీయపార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తేలిసిందే. అందులో ఎవరిది పైచేయి అనేదానికోసం పోటీలు పడుతున్నారు. బీజేపీ ,కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకు సాక్ష్యంగా రేవంత్ రెడ్డితో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక రిసార్ట్ లో రహస్య సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అవును నిజమే , మేమిద్దరం సమావేశం అయ్యాం కాని ఇప్పుడు కాదు అన్నిపార్టీల నేతలను కలిసి నప్పుడే రేవంత్ ను కలిశాను అని ఈటల చెబుతుండగా రేవంత్. మాత్రం వేంనరేందర్ రెడ్డి కూతురు పెండ్లికోసం లగ్న పత్రికి రాసుకునే కార్యక్రమంలో వేలాది మంది సమక్షమంలోనే కలుసుకున్నాం ఇందులో రహస్యం ఏముందని రేవంత్ అంటున్నారు. రేవంత్ ,ఈటల ఒకరికి ఒకరు పరస్పర విరుద్ధంగా మాట్లాడటం అనుమానాలకు తావిస్తుంది.

Related posts

గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై మంత్రి పువ్వాడ, ఎంపీ నామ సమీక్ష!

Drukpadam

మీడియాను ఎవ్వురు అడ్డుకోలేరు సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.

Drukpadam

 ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల

Ram Narayana

Leave a Comment