Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఆర్పీఎఫ్ బలగాల వలయంలో హుజురాబాద్.. అడుగడుగునా నిఘా

  • హుజూరాబాద్‌కు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలు
  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు
  • ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ వెల్లడి

హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఉపఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ తెలిపారు. దీనిలో భాగంగానే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో భద్రతకు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని, వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకున్నాయన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై కరీంనగర్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన గోయల్… ఉపఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కరోనా నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని, మద్యం, నగదు పంపిణీపై నిఘా మరింత పెంచాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులు, పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలపై వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశామన్నారు. నిబంధనల అమలులో ఎక్కడైనా అలసత్వం వహించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శశాంక్‌ గోయల్‌ హెచ్చరించారు.

Related posts

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన… మంత్రి శ్రీ పొంగులేటి

Ram Narayana

సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల!

Drukpadam

ఇంతకీ సీతక్క ఓటు ఎవరికీ వేసినట్లు ….?

Drukpadam

Leave a Comment