Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ ల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టిన ఐ జె యూ హైదరాబాద్ సమావేశాలు!

జర్నలిస్ట్ ల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టిన ఐ జె యూ హైదరాబాద్ సమావేశాలు!
-ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో జర్నలిస్ట్ యూనియన్ లకు చోటు -కల్పించకపోవడంపై న్యాయపోరాటం చేయాలనీ నిర్ణయం
-కరోనా తో మరణించిన జర్నలిస్ కుటుంబాలకు ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు పరిహారం ఇవ్వాలి
-ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చే నిధులను 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలి
-జర్నలిస్ట్ లపై వేధింపులు నిలిపివేయాలి
-పత్రిక ,టీవీ చానళ్ళు, తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి తీసుకోవాలి
-సమావేశాల్లో అతిధులుగా పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ,రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,

పాలకులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్ట్ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిపై ఈ నెల 23 ,24 తేదీలలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జె యూ ) సమావేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాలకుల వ్యవహార శైలిని ఎండగట్టాయి. జర్నలిస్టుల పై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని , సంఘ విద్రోహ శక్తులు , రాజకీయ పార్టీల నేతలు జర్నలిస్టులను టార్గెట్ చేసి హత్యలకు కూడా వెనకాడటంలేదని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలనే పత్రిక యాజమాన్యం పెట్టిన వత్తిడిని తట్టుకోలేక మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త పీసీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని , అదే విధంగా యూ పీ లో కేంద్రమంత్రి కాన్వాయ్ తొక్కించిన ఘటనలో ఒక జర్నలిస్ట్ చనిపోయిన విషయాన్నీ సమావేశం తీవ్రంగా ఖండించింది. కరోనా మహమ్మారి సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో 600 మందికి పైగా జర్నలిస్ట్ లు చనిపోయారని వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి పరిహారం అందించాలని సమావేశం డిమాండ్ చేసింది. జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఇస్తున్న 5 లక్షల నిధులను 25 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేసింది. ప్రెస్ కాన్సిల్ ఆఫ్ ఇండియా లో ఇప్పటివరకు జర్నలిస్ట్ సంఘాలకు ఉన్న ప్రాతినిధ్యం లేకుండా చేయడంపై సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ సి కె ప్రసాద్ అప్రజాస్వామిక నిరంకుశ వైఖరిని సమావేశం తప్పు పట్టింది. దీనిపై న్యాయపోరాటం చేయాలనీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. జర్నలిస్ట్ ఉద్యమం పై ,భావస్వచ్ఛపై జరుగుతున్న దాడులు లను ఎండగడుతూ వివిధరాష్ట్రాలలో సభలు సమావేశాలు నిర్వహించాలని సమావేశం పిలుపు నిచ్చింది .

ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, ఆంధ్రప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ , సమాచార కమిషర్ విజయకుమార్ రెడ్డి , ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి , తెలంగాణ టూరిజం ఎం డి మనోహర్ రావు ఐజేయూ మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి.వై.నరేందర్ రెడ్డి, స్క్రైబ్స్ న్యూస్ ఎడిటర్ ఆలపాటి సురేష్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ!

Drukpadam

రష్యా, అమెరికా పరస్పరం కాల్పులకు దిగితే అది మరో ప్రపంచ యుద్ధమే: జో బైడెన్!

Drukpadam

తృణమూల్ అఖండ విజయం : బీజేపీకి ఒక్కటీ దక్కలేదు…

Drukpadam

Leave a Comment