Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేను స్వయంగా వచ్చి ఓట్లు అడగాలని భావించా.. కానీ, కరోనా నిబంధనల కారణంగా రాలేకపోతున్నా: బద్వేలు ఓటర్లకు జగన్ లేఖ!

నేను స్వయంగా వచ్చి ఓట్లు అడగాలని భావించా.. కానీ, కరోనా నిబంధనల కారణంగా రాలేకపోతున్నా: బద్వేలు ఓటర్లకు జగన్ లేఖ
-ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
-ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా రాలేకపోతున్నానని ఆవేదన
-దాసరి సుధను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన

కర్నూలు జిల్లా బద్వేలు నియోజకవర్గ ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 30న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుండగా వైసీపీ నుంచి దాసరి సుధ పోటీలో ఉన్నారు. ఆమెను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని జగన్ ఆ లేఖలో కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారానికి రావాలని అనుకున్నానని, కానీ ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా రాలేకపోతున్నానని తెలిపారు.

తాను ప్రచారానికి వస్తే అక్కాచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరైనా కరోనా బారినపడే అవకాశం ఉందని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ప్రచారానికి రాలేకపోతున్నానంటూ పేరుపేరునా ముద్రించిన కర పత్రాలను స్థానిక నేతలు పంపిణీ చేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల్లో నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల వివరాలను కూడా అందులో పొందుపర్చారు.

Related posts

నకిలీ మందులు ,నాణ్యత లేని ఆహారం… ప్రజల జీవితాలతో చెలగాటం..!

Drukpadam

చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు!

Drukpadam

మాజీమంత్రి తుమ్మలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ..?

Drukpadam

Leave a Comment