Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రంపై పోరాడే దమ్ములేదని పవన్ సాబ్ తేల్చేశాడు: అంబటి రాంబాబు

కేంద్రంపై పోరాడే దమ్ములేదని పవన్ సాబ్ తేల్చేశాడు: అంబటి రాంబాబు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
నిరసనలు తెలుపుతున్న కార్మికులు
కూర్మన్నపాలెం సభకు విచ్చేసిన పవన్
కార్మికులకు సంఘీభావం
వైసీపీ ఎంపీలపై విమర్శలు
కౌంటర్ ఇచ్చిన అంబటి

విశాఖ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రంపై ఒత్తిడి తేవడం కంటే, రాష్ట్ర పాలకులను బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ బాధ్యతను కేంద్రం నెత్తిమీద పెడితే వారికి ఇక్కడ సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. అందుకే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వైసీపీ ఎంపీ లు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సొంతపనులు చక్క పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇది కేంద్రం చేస్తిలో ఉన్న వైసీపీదే బాధ్యత అన్నట్లు మాట్లాడారు . దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు.

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని ఆంధ్ర ప్రభుత్వంపైనే పోరాడుదామంటూ పవన్ పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై పోరాడే దమ్ములేదని పవన్ సాబ్ తేల్చేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సభాముఖంగా సంఘీభావం ప్రకటించిన పవన్ కల్యాణ్… ప్రధానంగా వైసీపీ ఎంపీలపైనే ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరంటూ నిలదీశారు. వారికి డబ్బు, కాంట్రాక్టులే ముఖ్యమని విమర్శించారు. దీనిపై అంబటి ,హోంమంత్రి మేకతోటి సుచరిత లు స్పందించారు. కేంద్రం చేతుల్లో ఉన్న విషయం కూడా రాష్ట్రపై రుద్దడానికి పవన్ పడరాని పట్లు పడుతున్నారని అన్నారు. సమస్య ఎక్కడ ఉంది మీ మిత్రపక్షమైన బీజేపీ చేతులో ఉంది. దాన్ని పక్కన పెట్టి వైసీపీ పై నీకున్న గుడ్డి వ్యతిరేకతతో రాష్ట్రప్రబుత్వంపై , వైసీపీ ఎంపీ లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా పవన్ నైజం ఏమిటో ప్రజలకు అర్థం అయిందని అన్నారు.

Related posts

మంత్రి పువ్వాడ పై భట్టి ధ్వజం వెనక వ్యూహం ఏమిటి ?

Drukpadam

జయలలిత సమాధి వద్ద కంటతడి పెట్టిన శశికళ!

Drukpadam

ఒక్క పబ్ పైనే దాడులు చేయడం అనుమానాలు కలిగిస్తోంది: విజయశాంతి

Drukpadam

Leave a Comment