ఏపీలో మల్లి ఎన్నికల గంట మోగింది: మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు!
ఏపీలో నెల్లూరు కార్పొరేషన్, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు
ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
వివిధ కారణాలతో గతంలో ఎన్నికలకు వెళ్లని స్థానిక సంస్థలు
ఈ నెల 14 నుంచి 16 వరకు ఎన్నికలు
3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ
నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు
ఏపీ లో మళ్ళీ ఎన్నికల గంట మోగింది…స్థానిక సంస్థలకు వివిధ కారణాలతో మిగిలిపోయిన ఎంపీటీసీ ,జడ్పీటీసీలు , కార్పొరేషన్లు , వార్డులు , డివిజన్లు లకు పంచాయతీలకు ఎన్నికలకు జరిపేందుకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల షడ్యూల్ విడుదల చేసింది. వీటిలో నెల్లూరు కార్పొరేషన్ తో పాటు , చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ సైతం ఉన్నాయి. గతంలో స్థానిక సంస్థలకు దూరంగా ఉంటానని ప్రకటించిన టీడీపీ ఈసారి మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా ? అనే ఆశక్తి నెలకొన్నది .
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా, కొన్ని కారణాలతో పలు స్థానిక సంస్థలకు, నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో, నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, 533 పంచాయతీ వార్డులు, 11 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎన్నికలు జరుపనున్నారు.
పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్ ఉంటుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలకు ఈ నెల 15న పోలింగ్ జరిపి, 17న ఓట్లు లెక్కిస్తారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది.