Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

‘కొవాగ్జిన్’ ను అధికారికంగా గుర్తించిన ఆస్ట్రేలియా…

‘కొవాగ్జిన్’ ను అధికారికంగా గుర్తించిన ఆస్ట్రేలియా…

  • కరోనా ప్రయాణ ఆంక్షలు సడలించిన ఆస్ట్రేలియా
  • 18 నెలల తర్వాత కీలక నిర్ణయం
  • కొవాగ్జిన్, చైనా వ్యాక్సిన్లకు ప్రయాణపరమైన ఆమోదం
  • భారత్, చైనా ప్రయాణికులపై తొలగిన ఆంక్షలు

భారత్ కు చెందిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ను ఆస్ట్రేలియా అధికారికంగా గుర్తించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇకపై తమ దేశానికి నిరభ్యంతరంగా రావొచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, చైనా తయారీ బీబీఐబీపీ కరోనా వ్యాక్సిన్ లకు ప్రయాణపరమైన గుర్తింపు ఇస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొవాగ్జిన్ తీసుకున్న 12 ఏళ్లు, అంతకు పైబడిన వయసు కలవారు…. బీబీఐబీపీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 18 నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో భారత్, చైనా, ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు పొందినవారిగా పరిగణనలోకి వస్తారని వివరించింది.

కరోనా వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఉంది. అయితే 18 నెలల తర్వాత ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆస్ట్రేలియన్లు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు వీలు కల్పించారు. అంతేకాదు, దేశంలోకి అడుగుపెట్టగానే క్వారంటైన్ లో ఉండాల్సిన నిబంధన కూడా తొలగించారు.

Related posts

ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలతో వచ్చే యాంటీబాడీలపై బ్రిటన్ అధ్యయనం.. సంచలన విషయాల వెల్లడి!

Drukpadam

కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచండి: ప్రధాని మోదీ!

Drukpadam

ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని గుర్తించిన బ్రిటన్!

Drukpadam

Leave a Comment