Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా: రేవంత్ రెడ్డి!

హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా: రేవంత్ రెడ్డి!
-హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు
-డిపాజిట్ దక్కించుకోలేని కాంగ్రెస్ అభ్యర్థి
-స్పందించిన రేవంత్ రెడ్డి
-ఎవరూ నిరాశకు గురికావొద్దని సూచన
-పార్టీలో సమీక్ష చేపడతామన్న రేవంత్

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు. కనీసం డిపాజిట్ కు కూడా నోచుకోలేదు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ఈ ఫలితం పట్ల ఎవరూ నిరాశ చెందవద్దని, అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. వయసు రీత్యా తనకు ఇంకా 20 ఏళ్ల పాటు పార్టీని నడిపించే సత్తా ఉందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమిపై పార్టీ నేతలతో చర్చిస్తానని వెల్లడించారు. వెంకట్ బల్మూరి ఈ ఓటమితో కుంగిపోవాల్సిన అవసరంలేదని, అతడికి పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.

కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది సమయం ఉందనగా అభ్యర్థిని ప్రకటించడం కూడా కాంగ్రెస్ వెనుకబాటుతనానికి కారణమైంది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నేతలు పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి , ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లోపం వల్లనే హుజూరాబాద్లో పార్టీ అభ్యర్థి కనీస పోటీ ఇవ్వలేక పోయారని అభిప్రాయపడ్డారు. దీనికి నైతిక భాద్యత వహించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.అయితే హుజురాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ వైఫల్యానికి నైతిక భాద్యత వహిస్తానని ప్రకటించారు .ఈ ఓటమికి ఎవరు కుంగి పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే బీజేపీ గెలుపు కాంగ్రెస్ మీద ఏమైనా ఉంటుందా ? అంటే అలాంటిది ఏమి ఉండదని ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఎన్నికకు చూడాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులూ మరింత పట్టుదలతో పనిచేయాల్సి ఉందని రేవంత్ అన్నారు.

 

హుజూరాబాద్‌ ఫలితం, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ స్పందన!

  • ఎన్నికల ఫలితంపై సమీక్ష నిర్వహిస్తాం
  • పార్టీలో చర్చించిన తర్వాతే స్పందిస్తా
  • కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఇంకా చూడలేదు
TS Congress incharge Manicham Tagore response on Huzurabad results
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు దాదాపు ఖరారయింది. ఈ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగింది. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎక్కడా కూడా సీన్ లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ మాట్లాడుతూ… ఎన్నికల ఫలితంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఇంకా చూడలేదని చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ సహకరించిందని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు.

Related posts

‘చంద్రబాబు డైనమిక్’ అంటూ తడబడి.. సవరించుకున్న స్పీకర్ తమ్మినేని!

Drukpadam

మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ప్రతిపాదన….

Drukpadam

పెట్రో ధరలపై కాంగ్రెస్ రాష్ట్రవ్యాపిత నిరసన … నిర్మల్ లో రేవంత్ ఖమ్మం లో భట్టి…

Drukpadam

Leave a Comment