Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం జిల్లాకు చెందిన కేరళ ఐపీఎస్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేసిన సీఎం విజయన్!

ఖమ్మం జిల్లాకు చెందిన కేరళఐపీఎస్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేసిన సీఎం విజయన్!
ఒకప్పుడు తెలంగాణ మంత్రి పదవి రేసులో ఉన్న అధికారి సస్పెండ్
మోసగాడికి అండగా ఉన్నాడని ఆరోపణలు
విచారణలో నిగ్గు తేల్చిన అధికారులు
సస్పెన్షన్ కు ఆమోద ముద్ర వేసిన కేరళ సీఎం

గుగులోతు లక్ష్మణ్ నాయక్.. ఆయనది తెలంగాలోని ఖమ్మం జిల్లా. ఎవరికీ పెద్దగా తెలిసుండదు కూడా. కానీ, కేరళలో మాత్రం ఇప్పుడు ఆ పేరు మార్మోగిపోతోంది. మంచి చేసి కాదు.. ఓ చెడు విషయంలో. అవును, ఓ మోసగాడికి అండగా నిలిచి తన ఉద్యోగానికి తానే ఎసరు పెట్టుకున్నారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా ఉన్న ఆయన్ను కేరళ హోం శాఖ నిన్న సస్పెండ్ చేసింది. సీఎం పినరయి విజయన్ అందుకు ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఏడీజీపీగా ప్రమోషన్ కు క్యూలో ఉన్న ఆయన్ను పక్కనపెట్టేసింది.

పురావస్తు డీలర్ నని చెప్పుకొన్న మాన్షన్ మావుంకల్ అనే ఓ మోసగాడికి లక్ష్మణ్ నాయక్ సహకారం అందించారని అధికారులు నిర్ధారించారు. మాన్షన్ చాలా మంది దగ్గర రూ.కోట్లు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టినట్టు తేల్చారు. మాన్షన్ వద్ద ఉన్న వస్తువులను విక్రయించేందుకు ఏపీకి చెందిన ఓ మహిళను లక్ష్మణ్ పరిచయం చేసినట్టు అధికారులు గుర్తించారు. కాగా, ఐజీతో ఉన్న పరిచయం ఆధారంగా మాన్షన్ తన వ్యాపారాన్ని పెంచుకున్నాడని, తమను మోసం చేసి కోట్లు కొల్లగొట్టారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకో విషయమేంటంటే.. ఒకానొక దశలో ఆయన తెలంగాణ మంత్రి పదవి రేసులో కూడా ఉన్నారట.

ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఐపీఎస్ అధికారి అప్పుడప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు జిల్లాకు వచ్చిపోతుంటారు . భద్రాచలం ఆలయసందర్శనకు సైతం ఆయన పలుమారులు వచ్చారు. ఇక్కడ కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. మంచి అధికారి గా పేరుతెచ్చుకున్న ఆయనకు ఎందుకు పాడుబుద్ది పుట్టిందో అర్థం కావడంలేదని ఆయన హితులు సన్నిహితులు పేర్కొంటున్నారు. అసలు అక్కడ ఏమి జరిగిందో పూర్తీ వివరాలు తెలియాల్సి ఉందని మరికొందరు అంటున్నారు.

Related posts

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్.. రూ. 5.70 కోట్ల బదిలీ!

Drukpadam

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు

Drukpadam

ఆవుల అక్రమరవాణా :సిలిండర్ పేలి 13 ఆవుల సజీవ దహనం!

Drukpadam

Leave a Comment