Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.: మధుయాష్కీ గౌడ్ ఫైర్!

కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.: మధుయాష్కీ గౌడ్ ఫైర్!
-తెలంగాణ గురించి కేసీఆర్ కే చెబుతారా?
-అంటే ప్రెస్ మీట్లలలో ఫైర్ అయ్యే కేసీఆర్ కు అసలు తెలంగాణ గురించి ఏమీ -తెలియదని.. రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదు.

కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు . తెలంగాణ గురించి అడిగితె మీడియా సమావేశాల్లో అడ్డదిడ్డగా మాట్లాడుతున్న విషయాన్నీ ప్రస్తావించారు. రాష్ట్రనికి ఏమి కావాలి , విభజన చట్టంలో ఇచిన హామీలపై ఏనాడూ కేంద్రాన్ని నిలదీయకుండా సాగిలపడి ఇప్పడు కేంద్రం పై యుద్ధం చేస్తున్నట్లు నటించడం ప్రజలను మోసం చేసేందుకేనని అన్నారు.

తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో.. తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి కనీస ప్రస్తావన కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలే.. వీటిపైనా ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా??మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్ లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు . కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా… ఇప్పుడు కేటీఆర్.. కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని కేసీఆర్ అందాన్ని ప్రస్తావిస్తూ అంటే ఇన్నేళ్లనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లే కదా అని ఆయన అన్నారు .

కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదని ధ్వజమెత్తారు . కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ. 1000 తగ్గింది. వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోందని , దీనిపై సంబంధిత మంత్రిగానీ.. ముఖ్యమంత్రిగానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు . టీఆర్ఎస్-బీజేపీలు ఇప్పటికైనా పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు.

Related posts

కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తున్నాం… హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలి :బాలకృష్ణ

Drukpadam

పెన్షన్ లు,,కొత్త రేషన్ కార్డులు కోసం ప్రజా పంథా ధర్నా,ప్రదర్శన

Drukpadam

కేసీఆర్.. మీది గుండెనా..బండనా.?: షర్మిల …

Drukpadam

Leave a Comment