Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌
-ఈ ఉదయం అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్
-హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
-గవర్నర్ కు ఆక్సిజన్ అందిస్తున్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ ఈ ఉదయం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మధ్యాహ్నం 1 గంటకు చేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రాజ్ భవన్ అధికారులు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బిశ్వభూషణ్ హరిచందన్ ఇదివరకే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అయినప్పటికీ- ఆయనలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆయన జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నారని సమాచారం. ఈ ఉదయం గవర్నర్ అనారోగ్యానికి గురయ్యారు.

రాజ్‌భవన్ అధికారులు వెంటనే ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన వెంట భార్య సుప్రవ హరిచందన్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డులో ఉంచి, డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు.

వృత్తిరీత్యా హరిచందన్ న్యాయవాది. జనతాదళ్‌లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ-బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. కీలకమైన రెవెన్యూ, న్యాయ, మత్స్యాభివృద్ధి శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనను ఏపీకి గవర్నర్‌గా పంపించింది.

 

Related posts

ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి.. నల్గొండ డీఐజీ రంగనాథ్

Drukpadam

బ్రిటన్ లో కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగింపు?

Drukpadam

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయాలు ….

Drukpadam

Leave a Comment