Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

  • ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి స్పష్టత కోరిన తెలంగాణ
  • కేటీఆర్ ఆధ్వర్యంలో గోయల్ ను కలిసిన మంత్రుల బృందం 
  • రెండ్రోజుల్లో నిర్ణయం ఉంటుందన్న గోయల్
  • త్వరగా తేల్చాలని మంత్రుల వినతి

ధాన్యం సేకరణ అంశం నేపథ్యంలో తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పియూష్ గోయల్ ను కోరారు.  దీనిపై కేంద్రం రెండ్రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తుందని పియూష్ గోయల్ వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న మరోసారి సమావేశం కావాలని తెలంగాణ మంత్రుల బృందం నిర్ణయించింది.

కేంద్రమంత్రితో భేటీ అయిన మంత్రుల బృందానికి కేటీఆర్ నాయకత్వం వహించారు. మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. యాసంగి ధాన్యంపై గోయల్ కు వివరించిన కేటీఆర్ బృందం… ధాన్యం సేకరణపై త్వరగా తేల్చాలని కోరింది.

Related posts

విభజనవల్ల ఏపీ నష్టం పోయింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే …జోనల్ కౌన్సిల్ లో సీఎం జగన్

Drukpadam

రైతుల ‘బ్లాక్ డే’.. పలువురు ముఖ్యమంత్రుల సహా ప్రతిపక్ష పార్టీల మద్దతు

Drukpadam

ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం …ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు!

Drukpadam

Leave a Comment