Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతు సంఘం ధర్నా!

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతు సంఘం ధర్నా!
-20 రోజులు గా రోడ్ల పైనే ఉన్న ధాన్యం రాసులు
-పరిశీలించిన రైతు సంఘం నేతలు
-ప్రభుత్వ చర్యలపై మండిపాటు

వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రహదారులు పై రాసులు పోసి 20 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వైఖరిని నిరసనగా ఆందోళన చేపట్టారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దాఛ్ఛాపురం , గరికపాడు లలో రహదారులు పై ధాన్యం రాశులు పరిశీలించారు . వైరా మండలం గరికపాడు సోసైటి కార్యాలయం వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా మండలం లో ప్రభుత్వం కేవలం 7 కొనుగోలు కేంద్రాలు మాత్రమే మంజూరు చేసి అవికూడా ప్రారంభించ లేదని విమర్శించారు . గరికపాడు సోసైటి పరిధిలో దాచ్చాపురం రైతులు గత 20 రోజులు నుంచి వరి కైలు చేసి ధాన్యం రాసులు రహదారులు పై కిలోమీటర్ల దూరం ఆరబోసి పగలు రాత్రులు పడిగాపులు పడుతున్నారు అని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లు పడుతున్నారు ఆందోళన వ్యక్తం చేశారు . వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, సకాలంలో జిల్లా అధికారులు స్పందించి ధాన్యం రైతుల ఇబ్బందులు తొలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ తోట నాగేశ్వరావు,విప్పలమడక సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మాజీ సర్పంచ్, పారుపల్లి కృష్ణారావు, సోసైటి డైరెక్టర్,బాణాల కృష్ణమాచారి, సోసైటి మాజీ వైస్ చైర్మన్ మాగంటి తిరుమలరావు, రైతు సంఘం నాయకులు కొల్లా వెంకటేశ్వరరావు, మేడ శరభంది, ఎస్ కె ఉంద్దడ్ సాహైబ్ , పతంగి రమేష్, రేమళ్ళ గాంధీ, బండి రామారావు, కొండా నర్సింహారావు, తల్లపరెడ్డి బాబు, లక్కిరెడ్డి ప్రసాద్ రెడ్డి, అయిలూరి ప్రతాప్ రెడ్డి,పతంగి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్.. ఇండియా స్థానం ఎంతంటే..!

Drukpadam

కాంగ్రెస్‌కు షాక్… మైనంపల్లి రాకను వ్యతిరేకిస్తూ మెదక్ డీసీసీ అధ్యక్షుడి రాజీనామా

Ram Narayana

ఢిల్లీ పీక పిసికేశారు.. ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు.. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment