Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రభుత్వం తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి…

ప్రభుత్వం తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి…
-మిర్చి రైతులను ఆడుకొని, నష్టపరిహారం ఇవ్వాలి.
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని

ఆకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యానికి తెలంగాణ సర్కారు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. బుధవారం.. సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ, జిల్లాలో వరి సాగుచేస్తున్న రైతులకు, ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధర, ఆకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, తడిచిన ధాన్యం, పంటలు మొలకెత్తుతున్నాయని దీనితో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . వర్షాల వల్ల రైతుల చేతికి వచ్చిన పంట తడిచిందని, రైతు చేతికి పంట వచ్చే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. రైతులందరికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో వ్యవసాయ రంగం దివాళా తీసిందని అన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉండగా, సి.ఎం. ఢిల్లీలో కాలక్షేపం చేయడం విడ్డురంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తితంగా వరి పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్న సందర్భంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే జిల్లాలో మిర్చి రైతులు వేసిన పంటలో కొత్త రకం వైరస్ వచ్చి మిర్చి పంటలు నష్టపోయారని, వైరస్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులకు గడ్డు కాలం నడుస్తుందని గత సంవత్సరం పత్తిరైతులు నష్టపోతే ప్రస్తుత ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో పలు రూపాల్లో వైరస్ కన్పించిందని పూత, పిందెలపై ప్రభావం చూపుతూ వాటిని రాల్చుతుందని తెలిపారు. ప్రభుత్వం వైరస్ నివారణ: చర్యలు చేపట్టాలని, ఉద్యానవన శాస్త్రవేత్తలు పరిశీలించి రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లా కమిటీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, భూక్యా వీరభద్రం , జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ప్రియాంక విడుదలకు సిద్దు డిమాండ్ …విడుదల చేయకపోతే లాఖిమ్ పూర్ వరకు మార్చ్ !

Drukpadam

రఘురామకృష్ణరాజు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలి: ప్రధానిని కోరిన వైసీపీ ఎంపీలు

Drukpadam

కొన్ని జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి: జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ!

Drukpadam

Leave a Comment