Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు.. రాకపోకలు నిలిపివేత!

తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు.. రాకపోకలు నిలిపివేత
-తప్పిన పెను ప్రమాదం …అప్పడే అక్కడ నుంచి బయట పడ్డ బస్
-10 రోజుల క్రితం ఇదే దారిలో విరిగిన కొండ చరియలు
-రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు ధ్వంసం
-భారీగా కోతకు గురైన రోడ్డు…చెట్లు ,బండరాళ్లతో నిండిన రోడ్
-మరమ్మతులు ప్రారంభించిన టీటీడీ అధికారులు

తిరుమల ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసమైంది. రోడ్ పై పెద్ద పెద్ద బండరాళ్లు , చెట్లు పడిపోయాయి. రోడ్ దాదాపు 100 మీటర్లుకు పైగా కోతకు గురైంది. కొండ కింద నుంచి పైకి వెళ్లే దారిలో ఇది జరగటంతో ట్రాఫిక్ కు భారీ అంతరాయం కలిగింది. సుమారు 6 కిలోమీటర్ల మేర కొండపైకి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఇంతటి పెద్దగా కొండ చరియలు విరిగిపడలేదని అంటున్నారు. దీంతో స్వామి ని దారిచించుకునేందు మరికొద్ది సమయంలో తిరుమల కొండమీదకు చేరుకుంటాం అని అనుకున్న సమయంలో ఇది జరగటంతో భక్తులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. రోడ్ చాల దూరం వరకు నెర్రలు బాచింది రోడ్ కు అడ్డంగా రాళ్ళూ చెట్లతో నిండిపోయి ఉంది దీంతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకునే రాకపోకలు నిలిపివేశారు. కొండపై నుంచి భారీ బండరాయి కింద పడడంతో తిరుమల రెండో కనుమ దారి 14 కిలోమీటర్ , 16 కిలోమీటర్ వద్ద చివరి మలుపు వద్ద రోడ్డు ధ్వంసమైంది. రోడ్డంతా రాళ్లతో నిండిపోవడం, కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలిపివేశారు. అయితే దానికి దగ్గరలో లింక్ రోడ్ ఉండటంతో దారి మళ్లించారు . కొండమీదకు వెళ్లినందుకు అధికారులు ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పైకి వెళ్లి రోడ్ క్లోజ్ కావడంతో మొదటి ఘాట్ రోడ్ నుంచి రాకపోకలను తాత్కాలికంగా పునరుద్దరించాలని ఆలోచనతో అధికారులు ఉన్నారు .

రోడ్డుపై పడిన రాళ్లను తొలగించి దారిని పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. రెండో ఘాట్‌రోడ్డులో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పుడు కూడా రోడ్డును మూసివేశారు. కొండ చరియలు విరిగి రోడ్ దెబ్బతిన్న చోట్ల మరమత్తులు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు .

సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు కొందరు .అలిపిరి కాలిబాటన పైకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. అయితే రోడ్ బాగా లేకపోవడం , కొంత దూరం బస్ లు వెళ్లే దారిలోనే కాలినడక భక్తులు కూడా వెళ్లాల్సి రావడంతో అధికారులు దానిపై కూడా ఆలోచనలు చేస్తున్నారు.

ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణానికి ప్రత్యాన్మయ మార్గాలు ఆలోచిస్తున్నామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. కొండచరియలు పెద్ద ఎత్తున విరిగిపడిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అందువల్ల ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలన జరుగుతుందని రెండవ ఘాట్ రోడ్ పునరుద్ధరణను సమయం పెట్టె ఆవకాశం ఉన్నందున వేరు మార్గాలద్వారా భక్తులను తిరుమల కొండపైకి వెళ్లే విధంగా విధంగా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. పైకి వెళ్లే మార్గంలో రెండు చోట్ల కొండా చరియలు పెద్ద ఎత్తున కూలిపోయానని రోడ్ కూడా బాగా దెబ్బతిన్నదని అన్నారు . యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామని మూడు అక్కడ విరిగిపడ్డ చెట్లు బండరాళ్లు తొలగించే చర్యలు చేపట్టామని అన్నారు.

ఘాట్ రోడ్ పునరుద్దరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు …టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణానికి ప్రత్యాన్మయ మార్గాలు ఆలోచిస్తున్నామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. కొండచరియలు పెద్ద ఎత్తున విరిగిపడిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అందువల్ల ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలన జరుగుతుందని రెండవ ఘాట్ రోడ్ పునరుద్ధరణను సమయం పెట్టె ఆవకాశం ఉన్నందున వేరు మార్గాలద్వారా భక్తులను తిరుమల కొండపైకి వెళ్లే విధంగా విధంగా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. పైకి వెళ్లే మార్గంలో రెండు చోట్ల కొండా చరియలు పెద్ద ఎత్తున కూలిపోయానని రోడ్ కూడా బాగా దెబ్బతిన్నదని అన్నారు . యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామని మూడు అక్కడ విరిగిపడ్డ చెట్లు బండరాళ్లు తొలగించే చర్యలు చేపట్టామని అన్నారు.

Related posts

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు ష‌ర్మిలపార్టీ దూరం- బట్ కండీష‌న్సస్ అప్లై!

Drukpadam

షాకింగ్ విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

Drukpadam

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పడ‌వ ప్ర‌మాదం…గోదావ‌రిలో ప‌డిపోయిన నేత‌లు!

Drukpadam

Leave a Comment