Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దక్షిణాఫ్రికాలో ఒక్క రోజులోనే రెండింతలైన ‘ఒమిక్రాన్’ కేసులు..

దక్షిణాఫ్రికాలో ఒక్క రోజులోనే రెండింతలైన ‘ఒమిక్రాన్’ కేసులు.. పెరుగుతున్న ఆందోళన

  • వేగంగా పెరుగుతున్న కేసులు
  • నిన్న ఒక్క రోజే 8,561 కేసులు వెలుగులోకి
  • కరోనాతో ఇప్పటి వరకు 90 వేలకుపైగా మృతి
  • మున్ముందు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు

ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ దక్షిణాఫ్రికాను మరింతగా భయపెడుతోంది. అక్కడ కొత్త కేసుల సంఖ్య ఒక్క రోజులోనే రెండింతలు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. గత వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న వార్తలకు తాజా కేసులు అద్దం పడుతున్నాయి. మంగళవారం 4,373గా నమోదైన కరోనా కేసులు బుధవారం నాటికి ఏకంగా 8,561కి చేరుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఒమిక్రాన్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మున్ముందు ఈ కేసుల సంఖ్య రెండింతలు, మూడింతలకు పెరగడాన్ని మనం చూస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రాంతీయ వైరాలజిస్ట్ డాక్టర్ నిక్సీ గుమెడె-మోలెట్సీ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో నవంబరు నెల ప్రారంభంలో కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వారపు సగటు రోజుకు 200 కేసులుగా నమోదైంది. అయితే, నెల మధ్య నుంచి కేసులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నవంబరు మొదట్లో కొత్త కేసులు ఒక్క శాతంగా ఉంటే నిన్న అవి ఏకంగా 16.5 శాతానికి పెరిగాయి.

డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలో జూన్, జులైలో దక్షిణాఫ్రికాలో ప్రతి రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 60 మిలియన్ల జనాభా ఉండే సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 2.9 మిలియన్ కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 90 వేల మంది మృత్యువాత పడ్డారు.

Related posts

వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయితే మేము ఉరేసుకోవాలా కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆశక్తి కార వ్యాఖ్యలు

Drukpadam

కరోనా వేళ… తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల అల్టిమేటం…

Drukpadam

కోవిడ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్ గాంధీ!!

Drukpadam

Leave a Comment