ఎమ్మారో వనజాక్షి ఏడ్చినప్పుడు భువనేశ్వరి స్పందిస్తే బాగుండేది …ఎమ్మెల్యే రోజా!
చంద్రబాబు వల్ల భువనేశ్వరికి అపాయం పొంచి ఉంది.. జాగ్రత్తగా ఉండాలి
నాడు ఎన్టీఆర్‌ను ఏడిపించారు
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు యత్నాలు
మామనే కాదు భార్యనూ ప్రమాదంలో పెడతారు
జరగనిది జరిగినట్లు చంద్రబాబు చెప్పారు.
‘ఏపీలో వనజాక్షికి అన్యాయం జరిగనప్పుడు కూడా స్పందించని నారా భువనేశ్వరి ఇప్పుడు మాట్లాడుతోంది.ఏపీ అసెంబ్లీలో తన గురించి తప్పుడు మాటలు మాట్లాడినందుకు కుంగిపోయానని, ఆడవారిని క్షోభపెడితే బాగుపడరని ఆమె ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. భర్త చెప్పిన అసత్య ప్రచారం విని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె నమ్మి వైసీపీ నేతలపై విమర్శలు చేస్తోంది. నువ్వు మాట్లాడడం చూస్తుంటూనే అర్థమవుతోంది. మీరు ఆయన చేస్తోన్న రాజకీయాల్లో చిక్కుకున్నారు’ అని రోజా అన్నారు .
ఏపీలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు నిన్న ఎన్టీఆర్ ట్రస్టు తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున సాయం అందజేసిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజమే అమ్మా.. ఎవరైతే ఆడవారిని ఏడిపిస్తారో, కుట్రలు చేసి వారిని తొక్కేయాలని చూస్తారో అటువంటి వారు వారి పాపాన వారే పోతారు. అందుకే గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఎన్టీఆర్‌ను ఏడిపించారు. ఆయనపై చెప్పులు విసిరారు. ఎన్టీఆర్‌ను ఏడిపించారు. ఆయనను ఏడిపించిన వారు ఎలా కనుమరుగు అయ్యారో కూడా మనం చూశాం’ అని రోజా చెప్పారు.
‘జగన్ ప్రభుత్వ పాలనలో మహిళలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో మాత్రం మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుష్కరాల సమయంలోనూ షూటింగ్ పిచ్చికి అనేక మంది చనిపోయారు. నారాయణ జూనియర్ కాలేజీలో ఆడపిల్లలకు అన్యాయం జరిగింది. గతంలో నాకూ టీడీపీలో అవమానాలు జరిగాయి’ అని రోజా వ్యాఖ్యానించారు.
‘చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉంది. భువనేశ్వరి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యనూ చంద్రబాబు ప్రమాదంలో పెడతారు. చంద్రబాబు వల్లే మీకు అపాయం పొంచి ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జరగని విషయాన్ని జరిగిందని చెప్పడానికి ఏడుస్తూ రెండున్నర గంటలపాటు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు జాగ్రత్తగా ఉండండి’ అని రోజా వ్యాఖ్యానించారు.